Health : ఉసిరితో హార్మోన్ల అసమతుల్యతకు చెక్.. ఇలా తింటే ఆ సమస్యలన్నీ పరార్..

by Javid Pasha |   (  Updated:2025-08-06 06:15:22  IST  )

Health : ఉసిరితో హార్మోన్ల అసమతుల్యతకు చెక్.. ఇలా తింటే ఆ సమస్యలన్నీ పరార్..

Health : ఉసిరితో హార్మోన్ల అసమతుల్యతకు చెక్.. ఇలా తింటే ఆ సమస్యలన్నీ పరార్..
X

దిశ, ఫీచర్స్ : చాలా మంది ఎదుర్కొనే ఆరోగ్య సమస్యలకు పోషకాహార లోపం, హార్మోన్ల అసమతుల్యత కూడా ప్రధాన కారణంగా నిపుణులు పేర్కొంటున్నారు. అయితే ప్రతీ సమస్యకు ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. మనం తీసుకునే రోజువారీ ఆహారాలు, సీజనల్ ఫ్రూట్స్ ద్వారా కూడా వాటికి చెక్ పెట్టవచ్చు. అలాంటి ప్రయోజనాలు కలిగించే వాటిలో ఉసిరికాయ (Amla or Indian Gooseberry) కూడా ఒకటి. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కారణంగా తలెత్తే అనేక సమస్యలకు ఇది చక్కటి పరిష్కారమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ఉసిరికాయలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. అప్పుడప్పుడూ లేదా రోజుకొకటి దీనిని తినడంవల్ల శరీరాన్ని డిటాక్సిఫై చేయడంలో, హార్మోన్ల ఉత్పత్తిని నియంత్రించడంలో, ఎండోక్రైన్ వ్యవస్థను బలపరచడంలో సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మహిళలకు ఇది ఔషధంలా పనిచేస్తుంది. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ సమస్యను ఎదుర్కొనేవారు తరచుగా ఉసిరి కాయను తినడంవల్ల కొంతకాలానికి ఆ ప్రాబ్లం దూరమయ్యే చాన్స్ ఉంటుందని ఆయుర్వేదం బెబుతున్నది.

సంతానోత్పత్తి, పునరుత్పత్తి ఆరోగ్యాన్ని మెరుగు పర్చడంలోనూ, శక్తిని పెంచుతూ ‘ప్రీ మెన్‌స్ట్రువల్ సిండ్రోమ్’ లక్షణాలను తగ్గించడంలోనూ ఉసిరి సహాయపడుతుంది. థైరాయిడ్ సమతుల్యతకు దోహదం చేస్తుంది. ఉసిరిలోని యాంటీ ఆక్సిడెంట్లు, ఆక్సిడేటివ్ ఒత్తిడిని తగ్గించి, హార్మోన్ అసమతుల్యతకు కారణమయ్యే ఫ్రీ రాడికల్స్‌ను నిరోధిస్తాయి. ఇందులోని విటమిన్ సి అడ్రినల్ గ్రంథులను బలపరిచి, స్ట్రెస్ హార్మోన్ అయిన కార్టిసాల్ స్థాయిలను నియంత్రిస్తుంది. అంతేకాకుండా హార్మోనల్ రిలేటేడ్ అనారోగ్యాలన్నింటినీ అడ్డుకోవడంలో ఉసిరిలోని పోషకాలు కీలకపాత్ర పోషిస్తాయి.

తాజా ఉసిరికాయను పచ్చిగా కూడా తినవచ్చు. దాని రసం కూడా తాగవచ్చు లేదా సప్లిమెంట్ రూపంలో తీసుకోవచ్చు. ఇక ఉసిరికాయ రసం లేదా చూర్ణం రోజువారీ ఆహారంలో చేర్చడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడటంతో పాటు హార్మోనల్ ఆరోగ్యం కూడా మెరుగవుతుంది. ఇది ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ స్థాయిలను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. అదనంగా ఉసిరికాయ రోగనిరోధక శక్తిని పెంచుతుంది.చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇది హార్మోనల్ అసమతుల్యత వల్ల కలిగే అన్ని సమస్యలను నివారించడంలో కీలకపాత్ర పోషిస్తుంది. Link

Next Story