వేసవిలో వేడి నుంచి ఉపశమనం పొందాలా.. ఈ టిప్ పాటించండి!

by Disha Web Desk 8 |
వేసవిలో వేడి నుంచి ఉపశమనం పొందాలా.. ఈ టిప్ పాటించండి!
X

దిశ, ఫీచర్స్ : ఈ మధ్య కాలంలో ఆరోగ్యంగా ఉండడం అనేది పెద్ద సవాలే అని చెప్పవచ్చు. ఎందుకంటే చాలా మంది మారుతున్న సమాజానికి అనుకూలంగా జీవించాలనే వారి లైఫ్ స్టైల్ ని పూర్తిగా మార్చుకుంటున్నారు. డ్రెస్సింగ్ స్టైల్ నుంచి మొదలు పెడితే ఫుడ్ వరకి టోటల్ చేంజ్ చేసుకున్నారు. అయిన ఒకప్పటి కల్చర్, ప్రస్తుత కల్చర్ పూర్తిగా మారింది. అధిక పొల్యూషన్ కారణంగా ఎన్నో ఆనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. అలాగే మంచి ఆరోగ్యం కోసం ఎన్నో ప్రయత్నలు చేస్తుంటారు. అయితే చాలా మంది సబ్జా గింజలు నీటిలో కలిపి తీసుకుంటారు. నిజానికి సబ్జా గింజలు ఆరోగ్యానికి చాలా మేలు చెస్తాయి. మరీ ముఖ్యంగా వేసవి కాలంలో ఈ గింజలు చలువగా ఉపయోగపడతాయి. రాబోతున్న వేసవి కాలంలో ఈ గింజల డిమాండ్ ఎక్కువే. ఒంట్లో వేడిని తగ్గించడానికి దోహాదం చేస్తుంది.

కొబ్బరి నీళ్లతో సబ్జా గింజలను ఇలా తీసుకోండి..

వేసవి కాలంలో ఈ గింజలను ఇలా తీసుకుంటే మేలు చేస్తాయంటున్నారు నిపుణులు. నిజానికి ఈ గింజలు ఆరోగ్యకరమైనవే కాకుండ మంచి ఆహారం. ఈ గింజలలో కొబ్బరి నీరుని యాడ్ చేయడం వల్ల మరింత ఆరోగ్యకరమని నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే కొబ్బరి నీళ్లలో పొటాషియం, మెగ్నీషియం, ఎలక్ట్రోలైట్స్ వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. అంతే కాకుండ ఈ గింజలను తులసి వాటర్ తో తీసుకుంటే కూడ మంచిదని చెప్తున్నారు. దీని వల్ల బాడీలో ఎసిడీటీ సమస్య ఉంటే తగ్గుతుంది.

కొబ్బరి నీటిలో కరిగే స్వభావం గల గుణం ఎక్కువ. ఇందులో ఫైబర్ అండ్ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. డీహైడ్రేషన్ సమస్యతో బాధపడేవారు ఇవి తీసుకోవడం వల్ల ఉపశమనం పొందుతారు. అయితే సబ్జా గింజలను తులసి గింజలు అని కూడ పిలుస్తారు అంట. తులసి మంచి ఔషధంగా ఉపయోగపడుతుందని అందరికి తెలిసిన విషయమే. ఈ గింజలు రక్తంలో చక్కెర స్థాయిలను క్రమబద్ధికరించి, మలబద్ధకాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. కొబ్బరి నీరు, సబ్జా గింజల కాంబినేషన్ ఆరోగ్యానికి ఎంతో మంచిదని ఆరోగ్య నిపుణులు తెలిపారు.



Next Story

Most Viewed