20ఏళ్ల సంపాదనను ఒక్క ఏడాదిలో సంపాదించాడు.. ఎలాగో తెలుసా?

by Disha Web Desk 9 |
20ఏళ్ల సంపాదనను ఒక్క ఏడాదిలో సంపాదించాడు.. ఎలాగో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్: భారతదేశంలో ఎక్కువమంది (70%) వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తుంటారు. రైతు దేశానికీ వెన్నుముక లాంటి వాడు. అందుకే మన దేశాన్ని వ్యవసాయ దేశంగా పిలుస్తారు. అయితే ఆయుష్ జాతవ్ అనే ఓ వ్యవసాయదారుడు.. రాజస్థాన్‌లోని భరత్‌పూర్ జిల్లా భుసావర్ పట్టణానికి చెందిన వ్యక్తి. ఈయన 20 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.

అలాగే బట్టల దుకాణం కూడా నడిపించేవాడు. ఆయుష్‌కు పిల్లలు పుట్టాక బాధ్యతలు పెరిగాయి. ఈ పరిస్థితుల్లోనే వ్యవసాయం ఆర్థిక పరిస్థితి క్షీణించడం మొదలయ్యింది. ఒకరోజు తన స్నేహితుడికి విషయాన్ని తెలుపగా.. మల్బరీ వ్యవసాయం చేస్తే ఎంతో లాభం వస్తుందని సలహా ఇచ్చాడు. మిత్రుడి సలహా మేరకు పశ్చిమ బెంగాల్ నుంచి 500లకు పైగా మల్బరీ మొక్కలను ఆర్డర్ చేసి సుమారు మూడు హెక్టార్ల భూమిలో మల్బరీ సాగు ప్రారంభించాడు. మొక్కలను నాటిన మూడేళ్ల తర్వాత అది ఫలాలు ఇవ్వడం ప్రారంభించింది.

దీంతో అతడి వార్షిక ఆదాయం 15 లక్షల నుంచి 20లక్షల వరకు ఉంటుంది. ఇది డైటరీ ఫైబర్, రెస్వెరాట్రాల్, ఆంథోసైనిన్స్, లుటీన్‌తో పాటు ఎన్నో ఇతర పాలీఫెనోలిక్ సమ్మేళనాలు వంటి సేంద్రీయ సమ్మేళనాలను కలిగి ఉంటుంది. ఈ పండ్లు తినడం వల్ల బరువు తగ్గడం, పొడి చర్మాన్ని మ‌దువుగా మార్చడం, కాలేయం, జీర్ణక్రియ, మూత్రపిండాల్ని ఆరోగ్యాన్ని ఉంచడం, రోగనిరోధక శక్తిని పెంచడం, ఇక కంటి చూపు మందగించిన వారికైతే ఎంతో మేలు చేస్తుంది. ప్రస్తుతం ఆయుష్ ఫ్యామీలి పరిస్థితి మెరుగుపడింది. ఇంత ఎక్కువ మొత్తంలో వస్తున్న దిగుబడిని చూసి ఇరుగు పొరుగు రైతులు కూడా ఈ పంటపై మొగ్గు చూపుతున్నారు.

Also Read..

చేతితో అన్నం తినడం వలన ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో?


Next Story

Most Viewed