Viral : ఇంప్రెస్ చేయడానికి అలా ప్రవర్తించే అబ్బాయిలు.. అమ్మాయిలకు అస్సలు నచ్చరట..!

by Javid Pasha |   (  Updated:2025-07-09 13:34:17  IST  )

Viral : ఇంప్రెస్ చేయడానికి అలా ప్రవర్తించే అబ్బాయిలు.. అమ్మాయిలకు అస్సలు నచ్చరట..!

Viral : ఇంప్రెస్ చేయడానికి అలా ప్రవర్తించే అబ్బాయిలు.. అమ్మాయిలకు అస్సలు నచ్చరట..!
X

దిశ, ఫీచర్స్ : సేమ్ జెండర్‌తో పోలిస్తే అపోజిట్ జెండర్ పట్ల మనుషులకు ఆసక్తి ఎక్కువ. అందుకే అమ్మాయిలు, అబ్బాయిల మధ్య పరస్పర ఆకర్షణ ఎక్కువ. అయితే కొన్ని సందర్భాల్లో అమ్మాయిలను ఇంప్రెస్ చేయడానికి అబ్బాయిలు, అబ్బాయిలను ఇంప్రెస్ చేయడానికి అమ్మాయిలు సాధారణం కంటే భిన్నంగా ప్రవర్తిస్తుంటారు కూడా. ఇది సాధారణమే అయినప్పటికీ తమచుట్టూ ఇతర పురుష స్నేహితులను కలిగి ఉన్నప్పుడు, అమ్మాయిలను ఇంప్రెస్ చేయడానికి తమ వ్యక్తిత్వానికి భిన్నంగా ప్రవర్తించే అబ్బాయిలను అమ్మాయిలు అస్సలు ఇష్టపడరని మిచిగాన్ యూనివర్సిటీ నిర్వహించిన ఇంటర్ పర్సనల్ డైనమిక్ స్టడీ పేర్కొన్నది.

అధ్యయనం ప్రకారం కొందరు అబ్బాయిలు లేదా పురుషులు ఒక గ్రూపుగా ఉన్నప్పుడు సౌమ్యంగా, ఆకర్షణీయంగా కనిపిస్తారు. కానీ స్నేహితుల సమక్షంలో వీరి ప్రవర్తన కొన్నిసార్లు పూర్తిగా మారిపోతూ ఉంటుంది. అమ్మాయిలను ఇంప్రెస్ చేయడానికి తమ సాధారణ వ్యక్తిత్వానికి భిన్నంగా బిహేవ్ చేస్తుంటారు. గట్టిగా మాట్లాడుతూ, జోకులు వేస్తూ, గొప్పలు చెబుతూ అతిగా ప్రవర్తిస్తుంటారు. ఈ ‘పర్ఫార్మెన్స్’ స్టైల్ వీరు తమ స్నేహితుల్లో గొప్పలు చాటుకోవడానికి, చుట్టు పక్కల ఉన్న స్త్రీలను లేదా అమ్మాయిలను ఆకట్టుకునే ఉద్దేశంతోనే ఎక్కువగా చేస్తుంటారని అధ్యయనం తెలిపింది. కానీ పురుషుల్లో లేదా అబ్బాయిల్లో ఈ విధమైన ప్రవర్తన అమ్మాయిల(స్త్రీల)కు అసహ్యాన్ని (ఇక్ ఫీలింగ్) కలిగిస్తుందని, పరిస్థితిని బట్టి వ్యక్తిత్వాన్ని, ప్రవర్తనను మార్చుకునే వారిని స్త్రీలు ఎక్కువగా ఇష్టపడరని అధ్యయనం వెల్లడించింది. Link

Next Story