Gen Z లవ్ అంటే ఆ మాత్రం ఉంటుంది.. రిలేషన్‌షిప్‌లో బోలెడు వెరైటీలు!

by Yella Dhawani Reddy |

ప్రేమ.. ఓ తియ్యనైనా ఫీలింగ్. ఎప్పుడు, ఎక్కడ, ఎలా పుడుతుందో ఎవ్వరూ చెప్పలేరు.

Gen Z లవ్ అంటే ఆ మాత్రం ఉంటుంది.. రిలేషన్‌షిప్‌లో బోలెడు వెరైటీలు!
X

దిశ, వెబ్ డెస్క్: ప్రేమ.. ఓ తియ్యనైనా ఫీలింగ్. ఎప్పుడు, ఎక్కడ, ఎలా పుడుతుందో ఎవ్వరూ చెప్పలేరు. ఒక్కప్పుడు ఇద్దరు ప్రేమించుకుంటున్నారు అంటే.. ఒకరంటే మరొకరికి ప్రాణంగా ఉండేవారు. అంతేకాదు, ఒకరిపట్ల మరొకరు ఎంతో నిజాయితీ, నమ్మకం, గౌరవం కలిగి ఉండేవారు. కానీ, Gen Z యువత ప్రేమ సంబంధాల గురించి మాటాడే తీరు మారిపోయింది. ఆధునిక ధోరణులు, సోషల్ మీడియా ప్రభావం వల్ల నేటితరం ప్రేమను కూడా ట్రెండ్‌లా చూస్తోంది. అంతేకాదు, వినడానికే ఆశ్చర్యకరంగా ఉండే పేర్లు పెట్టి.. వాటికి కొత్త అర్థాలను చెబుతున్నారు. వీటి అర్థాలు నేటి యువతకు ప్రేమపై ఉన్న కొత్త ఆలోచనలకు అద్దం పడుతున్నాయి. మరీ ఈ కొత్త పదాలు ఏంటో..? వాటి అర్థాలేంటో తెలుసుకుందామా?

* సిచ్యూయేషన్‌షిప్ (Situationship)

సిచ్యూయేషన్‌షిప్ అంటే.. ఇద్దరు వ్యక్తులు స్నేహితులకు ఎక్కువగా, ప్రేమికులకు తక్కువగా సంబంధం కలిగి ఉండటం. ఎలాంటి కమిట్‌మెంట్ లేకుండా మానసిక, శారీరక సంబంధాలు కలిగి ఉంటారు.

* నానో షిప్ (Nanoshship)

నానో షిప్ గురించి సింపుల్‌గా చెప్పాలంటే.. ఇదో డేటింగ్ ట్రెండ్. చాలా తక్కువ సమయంలో ఎలాంటి పెద్ద అంచనాలు లేకుండా ఏర్పడే సంబంధం. ఎంత త్వరగా ఈ బంధం ఏర్పడుతుందో అంతే త్వరగా ముగిసిపోతుంది. దీనివల్ల మనసుపై ప్రభావం కూడా తక్కువగా ఉంటుంది. చాలా మంది మనసులోని ఒంటరితనాన్ని దూరం చేసుకోవడానికి ఈ బంధంలోకి అడుగుపెడతారు.

* మైక్రోషిప్‌ (Microship)

ఇందులో ఇద్దరి మధ్య దీర్ఘకాలిక సంభాషణలు సాగుతాయి. ఇరువురి అభిప్రాయాలు ఒకరికొకరు పంచుకుంటారు. అయితే ఎక్కువకాలం ఇది నిలుస్తుందనేలోపు చిన్నచిన్న తేడాలతో బంధానికి తెర పడుతుంది. దీన్నుంచి బయటకొచ్చిన తర్వాత వెంటనే మరొకరితో స్నేహం మొదలుపెట్టడానికి ఎదురుచూస్తారు.

* స్నీకి లింక్ (Sneaky Link)

ఇద్దరు వ్యక్తులు ఎవరి తెలియకుండా రహస్యంగా కలుసుకుంటారు. వీరి మధ్య శారీరకంగా సంబంధం తప్ప మరేం ఉండదు.

* లవ్ బాంబింగ్ (Love Bombing)

మొదట్లో ఎక్కువ ఆప్యాయతగా ఉండటం. బహుమతులు, సర్పైజులు ఇవ్వటం వంటి చేస్తారు. అయితే, కాలక్రమేణా ఇది హింసాత్మకంగా మారుతుంది. ప్రతిదానికి కండిషన్స్ పెడుతుంటారు.

* రెడ్ ఫ్లాగ్ రిలేషన్‌షిప్ (Red Flag Relationship)

ఇది చాలా ప్రమాదకరమైన సంబంధం. తమ పార్ట్‌నర్ తను చెప్పినట్లుగానే వినాలని, తనతో తప్ప ఎవరితో మాట్లాడకూడదని ఆంక్షలు విధిస్తుంటారు. దీని వల్ల మానసికంగా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

* సాఫ్ట్ లాంఛ్ (Soft Launch)

తను ప్రేమలో ఉన్నట్లు సోషల్ మీడియాలో నేరుగా చెప్పకుండా.. చిన్న చిన్న సంకేతాలు ఇస్తుంటారు.

* హార్డ్ లాంఛ్ (Hard Launch)

తను ప్రేమలో ఉన్న విషయాన్ని అధికారికంగా తెలుపుతూ.. సోషల్ మీడియాలో తమ పార్ట్‌నర్ ఫొటోలను షేర్ చేయటం.

Next Story