Astrology : రవితేజ వెంకీ సినిమా రిపీట్... ఉద్యోగంలో జాయిన్ అయ్యేందుకు యూత్ పాట్లు వర్ణణాతీతం..

by Sujitha Rachapalli |
Astrology :  రవితేజ వెంకీ సినిమా రిపీట్... ఉద్యోగంలో జాయిన్ అయ్యేందుకు యూత్ పాట్లు వర్ణణాతీతం..
X

దిశ, ఫీచర్స్ : ఉద్యోగాలు ఎప్పుడు పోతున్నాయో.. ఎందుకు టెర్మినేషన్ జరుగుతుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. అందుకే ఈ విషయాలు తెలుసుకుని ముందు జాగ్రత్త పడేందుకు ప్రయత్నిస్తున్నారు Gen Z, మిలీనియల్స్. ఈ క్రమంలోనే జాతకాలు చూపించుకుంటున్నారు. కచ్చితంగా జరుగుతుందని 60% మంది నమ్ముతున్నారని తాజా అధ్యయనంలో తేలింది. తమకు జ్యోతిష్యుడు చెప్తున్నట్లే జరిగిందని.. ఆయన సూచనల మేరకు ముందుకు సాగితే కెరీర్ పై సానుకూల ప్రభావం చూపుతుందని అనుకుంటున్నట్లు వివరించింది. అకడమిక్ అండ్ యూరిటింగ్ ప్లాట్‌ఫారమ్ EduBirdie ఈ అధ్యయనాన్ని నిర్వహించింది.

కాగా భారతీయులు కూడా ఈ విషయంలో ఇలాగే ఉంటున్నారని.. astrotalk, astroyogi వంటి ప్లాట్ ఫామ్స్ లో జీతం, ప్రమోషన్స్, ఉద్యోగ భద్రత వంటి ఆందోళనల గురించి ప్రశ్నించే వారి సంఖ్య ఎక్కువైపోయిందని తేలింది. 15% మంది యువత జ్యోతిష్యం తమ డ్రీమ్ జాబ్స్ సాధించడంలో సహాయపడిందని చెప్పగా.. 13% మంది తమకు సెట్ కాని ఉద్యోగాన్ని విడిచిపెట్టేలా చేసిందని ఒప్పుకున్నారు. 36% మంది కొత్త కెరీర్ మార్గాన్ని ఎంచుకోవడంలో సహాయం చేసిందని... ఇక 41% Gen Z, మిలీనియల్స్ ఉద్యోగ ప్రతిపాదనను అంగీకరించే ముందు తమ కొలిగ్స్, బాస్ రాశిచక్రాలను కూడా చూస్తున్నట్లు తెలుస్తుంది. మ్యాచ్ కాలేదంటే మరో జాబ్ వెతుక్కోవడమో, శాంతి జరిపించడమో చేస్తారట. ఇక ఈ న్యూస్ చూసిన జనాలు.. రవితేజ వెంకీ సినిమా చూస్తున్నట్లు ఉందని అంటున్నారు.

Next Story

Most Viewed