Viral Video: కుంభమేళాలో దరిద్రం పోయిందనుకుంటే ఇలా తగులుకుందేటిరా.. పాపం అమాయకపు భర్త

by Vennela |

Viral Video: భార్యాభర్తల మధ్య జరిగే ప్రాంక్ ఎప్పుడు నవ్వు తెప్పిస్తుంటాయి.

Viral Video: కుంభమేళాలో దరిద్రం పోయిందనుకుంటే ఇలా తగులుకుందేటిరా.. పాపం అమాయకపు భర్త
X

దిశ, వెబ్ డెస్క్: Viral Video: భార్యాభర్తల మధ్య జరిగే ప్రాంక్ ఎప్పుడు నవ్వు తెప్పిస్తుంటాయి. సరిగా అలాంటి ఒక ప్రాంక్ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. భార్యాభర్తల మధ్య ఎంత అన్యోన్యత ఉన్నప్పటికీ, వారి మధ్య గొడవలు కూడా అంతే ఉంటాయి. కొన్నిసార్లు భర్తలు తన భార్య తమ నుండి దూరమైపోతే బాగుంటుంది అని ఆలోచించే వారు కూడా ఉంటారు.

ఎందుకంటే తమ భార్యల వల్ల వారు స్వేచ్ఛను కోల్పోతున్నామని, కుటుంబ బాధ్యతలు మోయలేకపోతున్నామని భావిస్తూ ఉంటారు. మరోవైపు భార్యను కూడా కుటుంబాన్ని కంట్రోల్ లో ఉంచుకునేందుకు భర్తను తన అదుపు ఆజ్ఞల్లో ఉంచుకునేందుకు ఇష్టపడుతుంటారు. ఇలా భార్యాభర్తల మధ్య దోబూచులాట అనేది సరదాగా ఉంటుంది. జబర్దస్త్ లాంటి కామెడీ షో లో ఎన్నోసార్లు భార్యాభర్తల మధ్య జరిగే గొడవలు అదేవిధంగా ఇతర సందర్భాలను మంచి నవ్వు తెప్పించేలా స్కిట్స్ రూపంలో ప్రదర్శిస్తుంటారు.

అవి సోషల్ మీడియాలో ఎంతో పాపులర్ అయ్యాయి. వాటిని పూర్తిగా తీసుకొని చాలామంది కంటెంట్ థియేటర్లు కూడా భార్యాభర్తల మధ్య జోక్స్ ను ఎక్కువగా క్రియేట్ చేసి చాలా వరకు నవ్వు తెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ అయినటువంటి ఇలాంటి వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ వీడియోలో భార్యాభర్త ఇద్దరు కుంభమేళా స్నానానికి వెళ్ళగా ఇద్దరు ఒకేసారి నీటిలో మునిగారు. ముందు భర్త బయటకు వచ్చాడు కానీ భార్య ఇంకా బయటకు రాలేదు దీంతో భర్త తన భార్య నీళ్లలో కొట్టుకుపోయిందని బాధపడాల్సింది పోయి ఆనందం వ్యక్తం చేస్తున్నాడు.

దీన్ని బట్టి ఆ ప్రబుద్ధుడు తన భార్య చేతిలో ఎంత ఇబ్బంది పడుతున్నాడో అర్థం చేసుకోవచ్చు. కానీ అతని ఆశ ఆవిరైపోయేలా అతని భార్య నీళ్లలోంచి బయటకు వచ్చింది కానీ వెంటనే తన ఎక్స్ప్రెషన్ మార్చేసి ఏమీ తెలియనట్టు ముఖం పెట్టేసాడు. ఈ వైరల్ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది. మీరు ఓ లుక్ వేయండి.



Next Story