- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తాళాలు మర్చిపోతున్నారా..? డోంట్ వర్రీ.. అది మీ సృజనాత్మకతకు నిదర్శనం..!
తాళాలు మర్చిపోతున్నారా..? డోంట్ వర్రీ.. అది మీ సృజనాత్మకతకు నిదర్శనం..!

దిశ, ఫీచర్స్ : ఇంట్లో నుంచి బయలు దేరుతారు కానీ.. సరిగ్గా పార్కింగ్‌లో బండి స్టార్ట్ చేస్తున్నప్పుడు ‘అయ్యో కీ మర్చిపోయాం కదా’ని మళ్లీ వెనక్కి వెళ్తుంటారు. ఆఫీసు నుంచి బయటకొస్తారు, కానీ బ్యాగో, టిఫినో, పర్సో, పౌచో మర్చిపోతుంటారు. కొన్నిసార్లు సెల్‌ఫోన్, మరికొన్నిసార్లు ఇంటికి తాళం వేయడం, ఇంకొన్ని సార్లు ఏదైనా వస్తువును కోల్పోవడం వంటి సహజంగానే జరిగిపోతుంటాయి. దీంతో కొందరు తమకు మతిమరుపు వచ్చిందేమోనని బాధపడుతుంటారు. కానీ డోంట్ వర్రీ.. ఎందుకంటే అప్పుడప్పుడూ అలా మర్చిపోవడమనేది మతిమరుపు కాదు, మీలోని క్రియేటివిటీకి నిదర్శనం అంటున్నారు నిపుణులు.
టూవీలర్ లేదా కారు తాళాలు మర్చిపోవడం, అప్పుడప్పుడూ ఏదైనా వస్తువు పోగొట్టుకోవడం 90 శాతం వరకు తెలివైన వ్యక్తుల విషయంలోనే జరుగుతుందని ‘Journal of Creative Behavior’ అధ్యయనం పేర్కొన్నది. ఎందుకలా అంటే..? వీరు తరచుగా లోతైన ఆలోచనల్లో మునిగిపోతుంటారు. తీరిక దొరికితే చాలు తమ వ్యాపారం, వృత్తి, కుటుంబ అవసరాలు, వ్యక్తిగత అభివృద్ధి, వృత్తి నైపుణ్యాలను మెరుగు పర్చుకోవడం వంటి విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటారు. కాబట్టి చిన్న చిన్న విషయాలపై సహజంగానే ఫోకస్ చేయరని అధ్యయనంలో వెల్లడైంది. అందుకే మీరూ అటువంటి అనుభవాన్ని ఎదుర్కొంటన్న వ్యక్తులైతే.. డోంట్ వర్రీ.. అప్పుడప్పుడూ మర్చిపోవడం మతిమరుపు కాదు, మీలోని సృజనాత్మకతకు, ఊహాత్మక ఆలోచలనకు నిదర్శనం.






