వెలుగు జిలుగుల సౌర పుష్పం.. స్మార్ట్‌‌ ఫ్లవర్ సోలార్ సిస్టమ్‌ను డెవలప్ చేసిన సాంకేతిక నిపుణులు

by Javid Pasha |   (  Updated:2025-08-01 09:38:44  IST  )

వెలుగు జిలుగుల సౌర పుష్పం.. స్మార్ట్‌‌ ఫ్లవర్ సోలార్ సిస్టమ్‌ను డెవలప్ చేసిన సాంకేతిక నిపుణులు

వెలుగు జిలుగుల సౌర పుష్పం.. స్మార్ట్‌‌ ఫ్లవర్ సోలార్ సిస్టమ్‌ను డెవలప్ చేసిన సాంకేతిక నిపుణులు
X

దిశ, ఫీచర్స్ : అది ఫ్రాన్స్‌లో ఇప్పుడిప్పుడే వికసిస్తున్న అందమైన సౌర పుష్పం. అక్కడక్కడ మాత్రమే కనిపిస్తున్న ఆర్ట్ అండ్ ఇంజినీరింగ్ సమ్మేళనాల సాంకేతిక అద్భుతం. అసలు పేరు స్మార్ట్ ఫ్లవర్ సోలార్ సిస్టమ్. నిజానికిది ఒక స్మార్ట్ టెక్నాలజీ. సూర్యరశ్మిని గ్రహించి విద్యుచ్ఛక్తిగా మార్చగల పువ్వు ఆకారంలో తయారు చేయబడిన సరికొత్త సోలార్ ప్యానెల్‌. ఉదయం నుంచి సాయంత్ర వరకు సూర్యుని నుండి వెలువడే ప్రతీ కిరణాన్ని ఆప్టిమైజ్ చేసుకునే స్వయం చాలక సౌర వ్యవస్థ. తన అద్భుతమైన పనితీరుతో విద్యుత్ వెలుగులు ప్రసరించగల అద్భుత సౌధం.

స్మార్ట్ ఫ్లవర్ సోలార్ సిస్టమ్‌ను మొదట ఆస్ట్రియాలోని స్మార్ట్ ఫ్లవర్ ఎనర్జీ టెక్నాలజీ కంపెనీ అభివృద్ధి చేసింది. దీనిని అలెగ్జాండర్ స్వాటెక్ అండ్ టీమ్ 2014లో రూపొందించింది. ట్రెడీషనల్ రూఫ్‌టాప్ సోలార్ ప్యానెళ్ల సంక్లిష్ట సెటప్‌ను సింప్లిఫై చేసే లక్ష్యంతో ఈ స్మార్ట్ ఫ్లవర్‌ను తయారు చేసింది. కానీ వినియోగంలోకి రాకముందే 2017లో సదరు కంపెనీ దివాలా తీయడంతో ఫ్రాన్స్‌కు చెందిన గోర్డాన్ అనే ఇంధన రంగ నిపుణుడు స్మార్ట్ ఫ్లవర్‌ హక్కులను సొంతం చేసుకున్నాడు. చాలాకాలం గ్యాప్ తర్వాత ఇప్పుడిప్పుడే ప్రాన్స్‌లో దాని పునరుత్పాదకతను ప్రారంభించారు. అయితే అక్కడక్కడా మాత్రమే దీనిని వినియోగిస్తున్నారు. తప్ప పూర్తిస్థాయిలో వాణిజ్య పరంగా అందుబాటులోకి తీసుకురాలేదు. త్వరలో వచ్చే అవకాశం ఉందంటున్నారు సాంకేతిక నిపుణులు.

స్మార్ట్ ఫ్లవర్ ఒక సరికొత్త ఆకర్షణీయమైన సోలార్ ఆధారిత వ్యవస్థ. ప్రతీ ఉదయం దాని రేకులు విచ్చుకుంటాయి. సూర్యుడు ఆకాశంలో కదులుతున్నప్పుడు పొద్దు తిరుగుడు పువ్వు మాదిరి ఈ స్మార్ట్ ఫ్లవర్ కూడా రియల్ టైమ్‌లో సూర్యకాంతిని అనుసరిస్తూ, సూర్యకిరణాల ద్వారా శక్తిని గ్రహిస్తూ స్టోర్ చేసుకుంటుంది. సూర్యాస్తమయం వేళ ఈ సాంకేతిక సౌర పుష్పం తనంతట తాను ముడుచుకుపోవడం ద్వారా గాలులు, వర్షం వంటి వాతావరణ పరిస్థితుల నుంచి కాపాడుకుంటుంది. అయితే పగలు, రాత్రి సమయంలో కూడా ఈ స్మార్ట్ ఫ్లవర్ సూర్యుడి నుంచి గ్రహించిన సోలార్ ఎనర్జీని వినియోగదారులు విద్యుత్తుగా ఉపయోగించుకోవచ్చు. ఇది ఇతర సోలార్ ప్యానెళ్లకంటే కూడా 40% ఎక్కువ విద్యుత్తును అందిస్తుంది. Link

Next Story