- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తండ్రి కష్టం గుర్తకు వచ్చి ఆలోచన మార్చుకుంది.. ఇప్పుడామె గ్రేట్ ఎంటర్ ప్రెన్యూర్!
ఆమె ఒకప్పుడు సాధారణ మహిళ.. ఇప్పుడు దాల్చిని టెక్నాలజీస్ అనే రిటైల్-టెక్ కంపెనీ ఫౌండర్ అండ్ సీఈఓ. ఈ సక్సెస్ ఎలా సాధ్యమైంది?

దిశ, పీచర్స్ : పనికి మాలిన వంద ఆలోచనలకంటే.. పనికొచ్చే మంచి ఆలోచన ఒక్కటి చాలు అంటారు పెద్దలు. ఎందుకంటే.. అది మనసును, మనిషిని మార్చేస్తుంది. పరిస్థితులు అనుకూలిస్తే జీవితమే మారిపోతుంది. కొంగొత్త అవకాశాలను క్రియేట్ చేస్తుంది. సాధారణ వ్యక్తిని సైతం ఉన్నత శిఖరాలకు ఎదిగేలా తీర్చిదిద్దుతుంది. సరిగ్గా అదే జరిగింది ఓ మహిళ జీవితంలో. ఆటంకాల సుడిగుండాలను అధిగమించిన ఆమె.. ఇప్పుడు గ్రేట్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తోంది. ఇంతకీ ఆమె ఎవరు? ఏం చేశారు? తదితర వివరాలకోసం.. లెట్స్ గో అండ్ రీడ్ దిస్ స్టోరీ..
ప్రారంభం ఇక్కడి నుంచే..
పేరు ప్రేరణ కల్రా (Prerna Kalra).. ఒకప్పుడు సాధారణ మహిళ.. ఆ తర్వాత పేటీఎం ఉద్యోగి, ఇప్పుడు దాల్చిని టెక్నాలజీస్ (Daalchini Technologies) అనే రిటైల్-టెక్ కంపెనీ ఫౌండర్ అండ్ సీఈఓ. ప్రస్తుతం భారతదేశంలో110కి పైగా నగరాల్లో 4,100 కంటే ఎక్కువ స్మార్ట్ వెండింగ్ మెషీన్లను ఈ కంపెనీ ఆపరేట్ చేస్తోంది. IoT-ఎనేబుల్డ్ టెక్నాలజీతో ఆటోనామస్ రిటైల్ ఎకోసిస్టమ్ సృష్టిస్తోంది. మీరట్‌లో జన్మించిన ప్రేరణ కల్రా, ఇంజనీరింగ్ & మేనేజ్‌మెంట్ చదివి, పేటీఎం (Paytm)లో ప్రారంభ ఉద్యోగుల్లో ఒకరిగా చేరారు. అక్కడ పేటీఎం వాలెట్ వంటి ముఖ్యమైన ప్రొడక్ట్స్‌ను బిల్డ్ చేయడంలో కీ రోల్ పోషించారు. అలా అంచలంచలుగా ఎదిగిన ఆమె సక్సెస్ జర్నీ ఎవరికైనా ఆశ్చర్యంతో పాటు ప్రేరణను సైతం కలిగిస్తుంది. దీనంతటికి గల కారణాల్లో ఆమె ఆలోచనా విధానం, కృషి, పట్టుదల కూడా ఒకటి.
స్టార్టప్ ప్రేరణ కలిగిందిలా..
డాల్చిని టెక్నాలజీస్‌ను స్థాపించాలనే ఆలోచన ప్రేరణకు ఎలా వచ్చిందంటే.. ఆమె ఒకసారి వర్క్ విజిట్‌లో భాగంగా చైనాలో పర్యటించారు. ఆ సమయంలో అక్కడున్న తాజా ఫుడ్ వెండింగ్ మెషీన్లను(fresh food vending machines) చూశారు. ఆ సమయంలో ఆమెకు తన తండ్రి భారతదేశంలో చిన్న దుకాణాన్ని నడపడంలో ఎదుర్కొన్న కష్టాలు గుర్తుకు వచ్చాయి. దీంతో 2017లో విద్యా భూషణ్‌తో కలిసి దాల్చినిని స్థాపించారు. టెక్నాలజీ సాయంతో ఆహార లభ్యత(Foodavailability)ను మెరుగుపరచాలనే లక్ష్యంతో అడుగు ముందుకు వేసింది. గత పేటీఎం అనుభవాన్ని ఉపయోగించి, దాల్చినిని ఫుల్-స్టాక్ రిటైల్-టెక్ స్టార్టప్‌గా మార్చడంలో సక్సెస్ అయింది. ప్రస్తుతం దాల్చిని ఆఫీసులు, ఫ్యాక్టరీలు, చిన్న పట్టణాల్లో సేవలందిస్తోంది. హోమ్ షెఫ్స్‌కు అవకాశాలు కల్పిస్తోంది. డైరెక్ట్-టు-కన్స్యూమర్ (D2C) బ్రాండ్ల వృద్ధికి సహాయపడుతోంది. దేశవ్యాప్తంగా మహిళా ఎంటర్‌ప్రెన్యూర్లను ఎంపవర్ చేస్తోంది. ఒక చిన్న ఆలోచన నుండి లక్షల మంది జీవితాలను మార్చే టెక్ ప్లాట్‌ఫాం వరకు ప్రేరణ కల్రా ప్రయాణం నిజంగా ప్రేరణాత్మకం కదూ!






