- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Love Languages : ప్రేమ భాషలు.. వ్యక్తీకరణ మార్గాలు.. ఏవి ఎలా ప్రభావితం చేస్తాయి?
లవ్ లాంగ్వేజెస్ అనేవి సంబంధాలలో సంబంధాలలో భావోద్వేగ అవసరాలను అర్థం చేసుకోవడానికి, బంధాలను బలోపేతం చేయడానికి సహాయపడతాయి.

దిశ, ఫీచర్స్ : ప్రేమ గురించి, ప్రేమ భావనల గురించి మీరు వినే ఉంటారు. కానీ ప్రేమ భాష గురించి ఎప్పుడైనా విన్నారా? అదొక అందమైన ఫీలింగ్ మాత్రమే కాదు, మాటల్లో, చేతల్లో కూడా వ్యక్తీకరించే మధురమైన భాష అని కూడా అంటారు నిపుణులు. ఈ లవ్ లాంగ్వేజ్ అనే కాన్సెప్ట్‌ను మొదటగా ప్రముఖ అమెరికన్ రచయిత, కౌన్సెలర్ అండ్ రిలేషన్‌షిప్ ఎక్స్‌పర్ట్(Counselor, and relationship expert) అయిన డాక్టర్ గ్యారీ చాప్‌మన్ ‘‘The Five Love Languages’’ అనే తన పుస్తకం ద్వారా పరిచయం చేశాడు. ఇంతకీ లవ్ లాంగ్వేజెస్ ఎన్ని రకాలు? వాటి ప్రయోజనాలు అంటే ఏమిటో చూద్దాం.
లవ్ లాంగ్వేజెస్ అనేవి సంబంధాలలో సంబంధాలలో (Romantic, Family, Friends) భావోద్వేగ అవసరాలను అర్థం చేసుకోవడానికి, బంధాలను బలోపేతం చేయడానికి సహాయపడతాయి. అంతేకాకుండా ప్రతీ వ్యక్తి తనకంటూ అత్యంత సౌకర్యవంతమైన లేదా అర్థవంతమైన మార్గంలో ప్రేమను అనుభవించడానికి ఒక ప్రాధాన్య భాషను కలిగి ఉంటారు. సాధారణంగా అవి 1. ప్రశంసలు లేదా ప్రోత్సాహం, 2. క్వాలిటీ సమయం, 3.సేవా కార్యక్రమాలు, 4. ఫిజికల్ టచ్, 5. బహుమతులు ఇచ్చి పుచ్చుకోవడం వంటి 5 రూపాల్లో వ్యక్తం అవుతుంటాయి.
1. ప్రశంసలు : ప్రశంసలు అంటే ఒక వ్యక్తిని మాటల ద్వారా పొగడటం, ప్రోత్సహించడం లేదా దయగల వ్యక్తి అనో, తెలివైన వ్యక్తి అనో వ్యాఖ్యలు చేయడం ఇందులో భాగమే. ఉదాహరణకు ‘నీవు నాకు చాలా ముఖ్యం లేదా నీవు ఈ పని అద్భుతంగా చేయగలవు లేదా చేశావు.
2. నాణ్యమైన సమయం : సమయం విలువైనదే కాదు, అది నాణ్యమైనది కూడా. కుటుంబం, స్నేహితులు, భార్యా భర్తలు, సహచరులు ఇలా ఎవరైనా సరే ఒకరికొకరు పూర్తి శ్రద్ధతో సమయం గడపడం ఇందులో భాగం. కలిసి మాట్లాడుకోవడానికి, యాక్టివిటీస్‌లో పాల్గొనడానికి, కలిసి సినిమా చూడటానికి లేదా డిస్కషన్ చేయడానికి మీరు కేటాయించే సమయం కూడా విలువైనదిగా ఉన్నప్పుడు అదొక ప్రేమ పూర్వకమైన భావనకు, భాషకు అద్దం పడుతుంది.
3. సేవ, కార్యక్రమాలు (Acts of Service): ప్రేమను చూపించడానికి లేదా వ్యక్తీకరించడానికి ఇతరుల కోసం ఏదైనా చేయడం కూడా లవ్ లాంగ్వేజెస్‌లో ఒక భాగం. ఉదా.. భాగస్వామి కోసం వంట చేయడం, ఇంటి పనుల్లో సహాయం చేయడం యాక్ట్ ఆఫ్ సర్వీస్ కిందకు వస్తాయి.
4. ఫిజికల్ టచ్ : శారీరక స్పర్శ కూడా ప్రేమ వ్యక్తీకరణలో భాగమని నిపుణులు చెబుతారు. హగ్ చేసుకోవడం, చేతులు పట్టుకోవడం లేదా సున్నితమైన స్పర్శ వంటివి ఇందుకు నిదర్శనం. ప్రేమికుల మధ్య, తల్లిదండ్రులు పిల్లల మధ్య, స్నేహితుల మధ్య ఈ విధమైన వ్యక్తీకరణలు ఉంటాయి.
5. బహుమతులు (Receiving Gifts): గిఫ్టులు ఇవ్వండం లేదా అందుకోవడం ద్వారా ప్రేమను చూపించడం లవ్ లాంగ్వేజ్‌లో భాగమే. అయితే కచ్చితంగా అలా చేయాలనే ఏమీ లేదు. కానీ ప్రేమ వ్యక్తీకరణలో ఇదొక మార్గంగా ఉంటోందని నిపుణులు చెబుతున్నారు.
ఎలా ఏర్పడతాయి?
*బాల్య అనుభవాలు : బాల్యంలో ఒక వ్యక్తి ఏ రకమైన ప్రేమను ఎక్కువగా అందుకున్నారు లేదా ఏది కోల్పోయారు? ఏది లోపించిందో అనే దాని ఆధారంగా కూడా ఆ వ్యక్తి ప్రేమ భాష రూపుదాల్చుతుంది. ఉదాహరణకు ఎన్నడూ ప్రశంసలు అందుకోలేని ఇంటి వాతావరణంలో పెరిగిన వ్యక్తి యుక్త వయసులో ప్రశంసాపరమైన మాటలను ఎక్కువగా కోరుకోవచ్చు.
*భావోద్వేగ అవసరాలు : బాల్యంలో భావోద్వేగంతో కూడిన ప్రేమ, మద్దతు వంటివి అందుబాటు లేకపోవడం (emotional availability in childhood), అధిక బాధ్యతలు వంటివి సర్వీస్ వర్క్ లేదా నాణ్యమైన సమయం వంటి భాషలను ప్రాధాన్యంగా మార్చవచ్చు.
*సాంస్కృతిక, సామాజిక కారకాలు: కొన్ని సంస్కృతులలో శారీరక స్పర్శ లేదా బహుమతులు ఎక్కువగా వ్యక్తం చేయబడతాయి. ఇవి వ్యక్తికి సంబంధించిన ప్రేమ భాషను ప్రభావితం చేస్తాయి.
*వ్యక్తిగత ప్రాధాన్యతలు: వ్యక్తిత్వ లక్షణాలు, జీవన శైలి, అనుభవాలు కూడా ఈ లవ్ లాంగ్వేజెస్‌కు ఆకారం ఇస్తాయి. ఉదాహరణకు ఒక వ్యక్తి సహజంగానే స్పర్శకు సౌకర్యంగా ఉంటే, వారు శారీరక స్పర్శను ఎక్కువగా ఇష్టపడవచ్చు.
ప్రయోజనాలు ఏమిటి?
* బలమైన సంబంధాలు: ఒకరి ప్రేమ భాషను తెలుసుకోవడం ద్వారా, భాగస్వామి, కుటుంబ సభ్యులు, లేదా స్నేహితులకు వారు కోరుకునే విధంగా ప్రేమను వ్యక్తం చేయవచ్చు. ఇది సంబంధాలను బలోపేతం చేస్తుంది.
*స్వీయ-అవగాహన: తమ ప్రేమ భాషను గుర్తించడం ద్వారా వ్యక్తులు, తమ భావోద్వేగ అవసరాలను మెరుగ్గా అర్థం చేసుకోవచ్చు. ఇది వారి కోరికలను స్పష్టంగా వ్యక్తం చేయడానికి సహాయపడుతుంది.
*ఎఫెక్టివ్ కమ్యూనికేషన్: ఇతరుల ప్రేమ భాషలను గుర్తించడం ద్వారా, అపార్థాలను తగ్గించి, భావోద్వేగ సంబంధాన్ని పెంచవచ్చు. ఒక విధంగా చెప్పాలంటే బాల్యంలో లోపించిన ప్రేమ రూపాలను గుర్తించి, యుక్త వయసులో వాటిని అందుకోవడం లేదా అందించడం ద్వారా భావోద్వేగ శ్రేయస్సు మెరుగు పడుతుంది.






