సింగిల్ కాదు కానీ.. అందుకోసం స్వైప్ చేస్తున్నారు!

by Javid Pasha |

డేటింగ్ యాప్‌లు ఇప్పుడు నిజమైన సంబంధాల కోసం మాత్రమే కాకుండా, ఆకర్షణ, క్యూరియాసిటీ, ఎమోషనల్ సపోర్ట్, ఎక్స్‌ట్రా మారిటల్ సంబంధాల కోసం కోసం కూడా ఉపయోగించడబడుతున్నాయి.

సింగిల్ కాదు కానీ.. అందుకోసం స్వైప్ చేస్తున్నారు!
X

దిశ, ఫీచర్స్ : డేటింగ్ యాప్‌లలో సంబంధాలకోసం వెతుకుతున్న వారిలో సింగిల్స్ మాత్రమే ఎక్కువగా నమోదై ఉంటారని చాలామంది భావిస్తుంటారు. కానీ ఇది వాస్తవం కాదని ఇటీవలి నివేదికలు పేర్కొంటున్నాయి. ఆల్రెడీ రిలేషన్‌షిప్‌లో ఉన్నవారు సైతం ఇందులో ఉంటున్నారని స్పష్టం చేస్తున్నాయి. వివాహితులైనప్పటికీ సింగిల్స్ కంటే యాక్టివ్‌గా స్వైప్ చేస్తున్నారు 65% వరకు ఉంటున్నారని వెల్లడిస్తున్నాయి. సింగిల్స్ తగిన జోడీ కోసం ప్రయత్నిస్తుంటే.. ఆల్రెడీ పెళ్లయినవారిలోనూ అనేకమంది ఎక్స్‌ట్రా మారిటల్ సంబంధాల కోసం, ఎమోషనల్ సపోర్ట్ కోసం డేటింగ్ యాప్‌లను స్వైప్ చేస్తున్నారు. ఈ ట్రెండ్ ఇటీవల పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు.

ఎక్స్‌ట్రా సంబంధాల కోసం..

చాలా మంది యూజర్లు ఇతరుల అవకాశాలను అన్వేషించడం, ధృవీకకరణ (validation) కోరుకోవడం లేదా క్యూరియాసిటీ కోసం కూడా డేటింగ్ యాప్‌లలో అడ్మిట్ అవుతున్నట్లు నివేదికలు తెలియజేస్తున్నాయి. ఇక స్వైప్ చేస్తున్న వారిలో పలువురు ఇప్పటికే భాగస్వామిని కలిగి ఉన్నప్పటికీ ఇతర ఎంపికలను, అంటే ఎక్స్‌ట్రా మారిటల్ రిలేషన్‌షిప్ కొనసాగించాలనే ఆలోచనతో కూడా ఇలా చేస్తున్నారని డేటింగ్ యాప్ నివేదికలను విశ్లేషిస్తున్న నిపుణులు పేర్కొంటున్నారు. ఈ ట్రెండ్ ఆధునిక డేటింగ్ సంస్కృతిలో కొత్త మార్పును సూచిస్తోందని చెబుతున్నారు. అంటే డేటింగ్ యాప్‌లు ఇప్పుడు కేవలం నిజమైన సంబంధాల కోసం మాత్రమే కాకుండా దృష్టి, ఆకర్షణ, ఈగో బూస్ట్

మారతున్న ధోరణి..

ఈ ట్రెండ్ ఆధునిక డేటింగ్ సంస్కృతిలో పెద్ద మార్పును సూచిస్తోంది. డేటింగ్ యాప్‌లు ఇప్పుడు కేవలం నిజమైన సంబంధాల కోసం మాత్రమే కాకుండా, దృష్టి, ఆకర్షణ, క్యూరియాసిటీ, ఎమోషనల్ సపోర్ట్, ఎక్స్‌ట్రా మారిటల్ సంబంధాల, ఈగో బూస్ట్ (focus, charm and ego boost)కోసం కూడా ఉపయోగించడబడుతున్నాయి. దీనివల్ల నమ్మకానికి సంబంధించిన సమస్యలు, గోస్టింగ్, డేటింగ్‌ను లావాదేవీగా (transactional) చూసే ధోరణి పెరుగుతోందని హెచ్చరిస్తున్నారు. ఏది ఏమైనా డేటింగ్ యాప్‌లలో మంచీ చెడూ, సమస్యలు సవాళ్లు సైతం ఎదురయ్యే అవకాశం ఉంటోంది కాబట్టి నిజమైన సంబంధాలకోసం చూసేవారు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Next Story