- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రోజ్‌మేరీ.. అలంకరణకే కాదు, ఆ విషయంలోనూ నేచురల్ బూస్ట్!
అలంకరణ కోసం మాత్రమే కాదు.. రోజ్‌మేరీ సువాసన మెదడును షార్ప్‌గా ఉంచుతుందని, జ్ఞాపక శక్తిని పెంచడంలో ప్రేరణగా నిలుస్తుందని నిపుణులు చెబుతున్నారు.

దిశ, ఫీచర్స్ : బహుశా మీరెప్పుడైనా గమనించే ఉంటారు. కొందరు తమ ఇండ్లల్లో, కార్యాలయాల్లో వివిధ మొక్కలు పెంచుతుంటారు. ముఖ్యంగా రోజ్‌మేరీ మొక్కను చాలామంది ఇష్టపడుతుంటారు. అయితే ఇది కేవలం అలంకరణ కోసం మాత్రమే కాదండోయ్.. దాని సువాసన మెడును షార్ప్‌గా ఉంచుతుందని, జ్ఞాపక శక్తిని పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు. యూకేలోని నార్తంబ్రియా యూనివర్సిటీ శాస్త్రవేత్తల అధ్యయనం కూడా ఇదే చెప్పింది. ఇంకా ఏయే బెనిఫిట్స్ ఉంటాయో చూద్దాం.
*జ్ఞాపకశక్తి & కాగ్నిటివ్ పనితీరు: కాగ్నిటివ్ సైకాలజీ, అరోమాథెరపీ ప్రకారం, రోజ్‌మేరీలోని 1,8-cineole అనే సమ్మేళనం మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. జ్ఞాపకశక్తిని, ఏకాగ్రతను పెంచడంలో సహాయపడుతుంది.
*బ్రెయిన్ ఫాగ్ తగ్గడం: రోజ్‌మేరీ తాజా వాసన బ్రెయిన్ ఫాగ్‌ను తగ్గించి, దీర్ఘకాలిక వర్క్ సెషన్లలో ఏకాగ్రతను పెంచుతుంది. దీంతో ఎక్కువసేపు స్పష్టంగా ఆలోచించగలుగుతారు.
*స్ట్రెస్ తగ్గి, అలర్ట్‌నెస్ పెరగడం: ఈ సువాసన కార్టిసాల్ (స్ట్రెస్ హార్మోన్) స్థాయిని తగ్గించి, కెఫీన్ లాంటి జిట్టర్స్ లేకుండా సహజంగా ఎనర్జీ ఇస్తుంది. దీంతో మీరు మరింత అలర్ట్‌గా ఉంటారు.
* ప్రాస్పెక్టివ్ మెమరీ మెరుగుపడటం: నార్తంబ్రియా యూనివర్సిటీ అధ్యయనాల ప్రకారం.. రోజ్‌మేరీ వాసన ఉన్న గదిలో ఉన్నవారు భవిష్యత్ పనులు గుర్తుంచుకోవడం (prospective memory)లో 15% వరకు మెరుగైన ఫలితాలు సాధించారు. ఇది రోజువారీ పనులు, అపాయింట్‌మెంట్లు గుర్తుంచుకోవడంలో చాలా ఉపయోగకరం.
*పిల్లల వర్కింగ్ మెమరీకి సహాయం: 9–11 ఏళ్ల పిల్లలపై చేసిన అధ్యయనంలో రోజ్‌మేరీ వాసన వారి వర్కింగ్ మెమరీను గణనీయంగా మెరుగుపరిచింది. ఇది పాఠశాలలు, స్టడీ రూములకు కూడా మంచి ఆప్షన్.
*మూడ్ & హార్ట్ రేట్ మెరుగుపడటం: వర్క్‌స్పేస్‌లో రోజ్‌మేరీతో సహా ఆకుపచ్చ మొక్కలు ఉండటం హార్ట్ రేట్‌ను తగ్గించి, మూడ్‌ను ఉత్తేజపరుస్తుంది. ఇది స్ట్రెస్‌ను తగ్గించి, రోజంతా ఉత్సాహంగా ఉండడానికి సహాయపడుతుంది.
*సహజ ఔషధం లాంటి ప్రభావం: రోజ్‌మేరీ కేవలం అందమైన మొక్క కాదు. ఇది మీ మెదడు పనితీరును మెరుగుపరిచే ఔషధం లాంటిది. ఇంట్లో లేదా ఆఫీస్ టేబుల్ మీద ఒక చిన్న మొక్క ఉంచడం ద్వారా మీరు రోజంతా స్పష్టమైన ఆలోచనతో ఉంటారనడంలో అతిశయోక్తి లేదు.
*గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.






