- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, ఫీచర్స్ : మారుతున్న పరిస్థితులకు, అవసరాలకు అనుగుణంగా మనిషి జీవన శైలి కూడా మారుతోంది. మోడ్రన్ టెక్నాలజీ కూడా అందుకు ఎంతో దోహదపడుతోంది. కానీ ఇటీవల వీటితోపాటు మానసిక, ఆరోగ్య సమస్యలు కూడా పెరుగుతున్నాయని మానసిక నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా స్ట్రెస్, డిప్రెషన్, మూడ్ స్వింగ్ అనే పదాల వాడకం ప్రస్తుతం కామన్ అయిపోయిందని, వీటిని చాలామంది పెద్ద సమస్యలుగా గుర్తించకపోవడంవల్ల బాధితులు అవస్థలు పడాల్సి వస్తోందని అధ్యయనాలు పేర్కొంటున్నాయి.
ఎవరైనా ఒక వ్యక్తి తన ఆరోగ్యం బాగోలేదని అంటే డాక్టర్ వద్దకు వెళ్లాలని సలహా ఇస్తుంటాం. కానీ అదే వ్యక్తి మనసు బాగోలేదని అంటే మాత్రం అవునా.. అనేసి ఊరుకుంటాం. ఎందుకంటే మెంటల్ హెల్త్ గురించి మనమే కాదు, సమాజంలో ఎవరూ పెద్దగా పట్టించుకోరు. దానిపై డిస్కషన్ పెట్టరు. పైగా అదొక వ్యక్తిగత సమస్యగానో, బలహీనతగానో భావిస్తుంటారు. ఇటువంటి పరిస్థితులవల్లే సాధారణ మానసిక ఒత్తిడి తీవ్రమైన డిప్రెషన్‌కు దారితీస్తోందని ఇండియన్ జర్నల్ ఆఫ్ సైకియాట్రిలో పబ్లిషైన ఒక అధ్యయనం పేర్కొంటున్నది.
47% మందిలో అదే ఆలోచన..
మెంటల్ హెల్త్‌పై ప్రజల్లో ఎటువంటి ఆలోచన, అవగాహన ఉందో తెలుసుకునేందుకు నిపుణులు పలు కోణాల్లో అధ్యయనాలు నిర్వహించారు. అయితే 47 శాతం మంది ప్రజలు మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు హింసాత్మకంగా ఉంటారని నమ్ముతున్నట్లు తేలింది. మరో 60 శాతం మంది దానిని పర్సనల్ ప్రాబ్లమ్‌గా, బాధితుల వ్యక్తిగత వ్యవహారంగా చూస్తున్నారు. పైగా కొందరు నచ్చిన పనులు, వ్యాయామం చేయడం వంటివి ఒత్తిడిని తగ్గిస్తాయని సలహా ఇస్తుంటారు.
కారణాలు ఇవే..
భారత దేశంలోనూ మానసిక ఆరోగ్య సమస్యలు ఇటీవల పెరుగుతున్నాయి. 13 నుంచి 17 ఏండ్లలోపు వయస్సు గల వారిలో 7.3 శాతం వీటిని ఎదుర్కొంటున్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. చిన్నగా ప్రారంభమైనప్పుడు గుర్తించకపోవడం, బయటపడే ప్రయత్నం చేయకపోవడం వల్ల స్ట్రెస్ అనేది క్రమంగా డిప్రెషన్‌కు దారితీస్తోంది. అనుకున్నవి జరగనప్పుడు, కుటుంబ, వ్యక్తిగత, ఆర్థిక ఇబ్బందులు వెంటాడటం వంటివి ఎక్కువగా ఒత్తిడికి గురిచేస్తుంటాయి. అయితే ఇవి తాత్కాలికంగా వచ్చిపోతుంటాయి. కానీ ఎక్కువకాలం కొనసాగితే మాత్రం డిప్రెషన్‌కు దారితీస్తాయని నిపుణులు చెప్తున్నారు.
లక్షణాలు - పరిష్కారం
డిప్రెషన్ లక్షణాల విషయానికి వస్తే నిద్రలేమి, ఎప్పుడూ ఏదో కోల్పోయినట్లు బాధగా ఉండటం, వర్క్ మీద ఇంట్రెస్ట్ లేకపోవడం, తరచుగా అపరాధ భావంతో ఉండటం, సూసైడ్ చేసుకోవాలనిపించడం, విషయాలపట్ల క్లారిటీ లేకపోవడం వంటివి ఉన్నాయి. ఈ వెల్‌లో ప్రాబ్లం ఉన్నప్పుడు తప్పక సైకియాట్రిస్టులను సంప్రదించాలి. కొందరు ఒత్తిడి లేదా డిప్రెషన్ వంటివి ఉన్నప్పుడు మద్యపానం చేయడం, విహారయాత్రలకు వెళ్లిరావడం, యోగా, ధ్యానం వంటివి చేస్తే తగ్గిపోతాయని సలహా ఇస్తుంటారు. కానీ ఇవి మాత్రమే డిప్రెషన్‌కు సరైన పరిష్కారం కాదని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే సాధారణ ఒత్తిడిలో ఉన్నప్పుడు అవి రిలాక్సేషన్ ఇవ్వొచ్చునేమో కానీ క్రానిక్ స్ట్రెస్ లేదా డిప్రెషన్ వంటి వాటికి మాత్రం వైద్యపరమైన చికిత్సలు అవసరమని చెబున్నారు.
*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమనాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.






