స్పైసీ ఫుడ్స్ తినడం ఆరోగ్యానికి మంచిది.. ఇదిగో బెనిఫిట్స్!

by Javid Pasha |   (  Updated:2025-12-13 08:06:21  IST  )

మసాలా ఆహారాలు తరచుగా తినడం వల్ల వాటిలోని క్యాప్సైసిన్ మెటాబాలిజం రేటును పెంచి, క్యాలరీలు బర్న్ చేయడానికి సహాయపడుతుంది.

స్పైసీ ఫుడ్స్ తినడం ఆరోగ్యానికి మంచిది.. ఇదిగో బెనిఫిట్స్!
X

దిశ, ఫీచర్స్ : సాధారణంగా కారం ఎక్కువగా ఉండే ఆహారాలు (Spicy foods) తినకూడదని కొందరు చెబుతుంటారు. దీనివల్ల ఛాతీలో మంట, అజీర్తి వంటి ప్రాబ్లమ్స్ తలెత్తుతాయి. అది నిజమే కావచ్చు. అయితే కొందరు అసలుకే స్పైసీ ఫుడ్స్ తినడం మానేస్తుంటారు. ఇది ఆరోగ్యానికి నష్టం చేస్తుందని పోషకాహార నిపుణులు అంటున్నారు. వాస్తవానికి అవరమైన స్పైసీ ఫుడ్స్ తినడం మంచిదని, వాటివల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని చెబుతున్నారు. అవేమిటో చూద్దాం.

స్పైసీ లేదా మసాలా ఫుడ్స్ తిన్నప్పుడు శరీరంలో క్యాప్సైసిన్ అనే రసాయనం ప్రభావం చూపుతుంది. నిజానికిది మిరపకాయల్లో ఎక్కువగా ఉండే పదార్థం. కాబట్టి మిరప కాయలను, పొడిని కూరల్లో, వివిధ ఆహారాల్లో తప్పక వాడుతారు. కొంచెం కారంగా ఉండే ఆహారాలు తిన్నప్పుడు సహజంగానే వాటిలోని క్యాప్సైసిన్ నాలుక, నోటి లోపలి భాగాల్లోని పెయిన్ రిసెప్టర్లను యాక్టివేట్ చేస్తుంది. దీని వల్ల మౌత్ బర్నింగ్ సెన్సేషన్, చెమటలు పట్టడం, ముక్కు కారడం, కళ్లలో నీరు వచ్చేలా శరీరం రియాక్ట్ అవడం వంటి అనుభవాలు ఎదుర్కొంటారు. ఎందుకంటే శరీరం క్యాప్సైసిన్‌ను టాక్సిన్‌గా భావించి, దాన్ని తొలగించడానికి ప్రయత్నిస్తుంది. దీని ఫలితంగా హార్ట్ రేట్ పెరగడం, బ్లడ్ ప్రెజర్‌లో మార్పులు సంభవిస్తాయి. అయితే వెంటనే ఎండార్ఫిన్స్ విడుదల అవుతాయి. ఇవి పెయిన్ రిలీఫ్ అండ్ హ్యాపీ ఫీలింగ్స్ ఇస్తాయి.

మసాలా ఆహారాలు తరచుగా తినడం వల్ల వాటిలోని క్యాప్సైసిన్ మెటాబాలిజం రేటును పెంచి, క్యాలరీలు బర్న్ చేయడానికి సహాయపడుతుంది. దీని వల్ల వెయిట్ లాస్ సాధ్యం అవుతుంది. అందుకే కారం ఎక్కువగా తినేవారిలో ఊబకాయం వంటి సమస్యలు రావు. కారం తినడం వల్ల ఇది గట్ హెల్త్‌ను మెరుగుపరచి, బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను తగ్గించి, హార్ట్ హెల్త్‌కు మేలు చేస్తుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం.. మసాలా లేదా కారంగా ఉండే ఆహారాలు ఇన్ఫ్లమేషన్‌ను తగ్గించి, ఇమ్యూన్ సిస్టమ్‌ను బలపరుస్తాయి. అయితే మరీ అధికంగా తినడం వల్ల కొన్ని రిస్క్‌లు కూడా ఉన్నాయి. ముఖ్యంగా గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ట్రాక్ట్‌ను ఇరిటేట్ చేసి, హార్ట్‌బర్న్, యాసిడ్ రిఫ్లక్స్, స్టమక్ పెయిన్, డయేరియా వంటివి సమస్యలు తలెత్తుతాయి. ఎక్కువ స్పైసీ తినడం తినడంవల్ల తలనొప్పి, నిద్రలేమి, వాంతులు, లాంగ్-టర్మ్‌లో గ్యాస్ట్రిక్ అల్సర్‌లు కూడా రావచ్చు. ముఖ్యంగా సెన్సిటివ్ స్టమక్ ఉన్నవారు, గర్భిణులు పరిమితికి మించిన స్పైసీని తినకపోవడం మంచిది అంటున్నారు నిపుణులు.

Next Story