సీజనల్ వ్యాధుల రిస్క్.. బొప్పాయి తింటే ఆ సమస్యలన్నీ పరార్!

by Javid Pasha |

సీజనల్ వ్యాధుల రిస్క్.. బొప్పాయి తింటే ఆ సమస్యలన్నీ పరార్!
X

దిశ, ఫీచర్స్ : మిగతా సీజన్లతో పోలిస్తే చలికాలంలో భిన్నమైన వాతావరణం ఉంటుంది. ముఖ్యంగా చలి గాలులు వీయడం వల్ల జలుబు, గొంతునొప్పి, కండరాలనొప్పి వంటి సమస్యలు తలెత్తుతాయి. ఇక దోమకాటు వల్ల డెంగ్యూ, మలేరియా వంటి సీజనల్ వ్యాధులు కూడా సంభవిస్తుంటాయి. అయితే ఏ వ్యాధులైనా ముందుగా రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిపైనే దాడిచేస్తుంటాయి. కాబట్టి సీజనల్ వ్యాధుల బారిన, ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఉండాలంటే శరీరంలో తగిన ఇమ్యూనిటీ పవర్‌ అవసరం. అది బొప్పాయి తినడం ద్వారా కూడా లభిస్తుందని, ముఖ్యంగా చలికాలంలో సీజనల్ వ్యాధుల నుంచి సంరక్షణకు ఔషధంలా పనిచేస్తుందని పోషకాహార నిపుణులు, ఆయుర్వేదిక్ వైద్య నిపుణులు అంటున్నారు. ఇంకా ఏయే బెనిఫిట్స్ ఉంటాయో ఇప్పుడు చూద్దాం.

బొప్పాయి(papaya)లో సహజంగానే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. దీంతోపాటు విటమిన్ ఎ, సి పుష్కలంగా ఉంటాయి. పండులోనే కాకుండా కాయలో, ఆకుల్లో కూడా ఇవి ఉంటాయి. అయితే చల్లటి వాతావరణంలో బొప్పాయిని తినడంవల్ల శరీరాన్ని వెచ్చగా ఉంచడంలో సహాయపడుతుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ముఖ్యంగా డెంగ్యూ పేషెంట్లకు ఔషధంలా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే రోగ నిరోధక శక్తిని పెంచడం ద్వారా ప్లేట్ లెట్స్ పడిపోకుండా కాపాడుతుంది. అలాగే లివర్‌ సమస్యలను, యాసిడ్ రిఫ్లె్క్స్‌ సమస్యలను సైతం నివారిస్తుంది. ఎసిడిటీని, కడుపులో ఉబ్బరాన్ని, అజీర్తిని తగ్గించడంల సహాయపడుతుంది. ఫైబర్ కంటెంట్ అధికంగా ఉండటంవల్ల అధిక అధిక బరువును, శరీరంలో హానికారక కొవ్వును తగ్గించడంలోనూ కీ రోల్ పోషిస్తుంది. డెంగ్యూ బాధితులు బొప్పాయి ఆకుల రసాన్ని తాగితే పడిపోయిన ప్లేట్‌లెట్స్ సంఖ్య కూడా పెరుగుతుందని ఆయుర్వేదిక్ ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Next Story