- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నానో బనానా 2 : వేగం & నాణ్యతలో కొత్త విప్లవం!
అత్యధిక వేగంతో, నిమిషాల్లోనే హై క్వాలిటీ ఫొటోలు, ఫొటో ఎడిట్స్‌ను జనరేట్ చేయడంలో నానోబనానా 2 అద్భుతంగా పనిచేస్తుంది

దిశ, ఫీచర్స్ : నానో బనానా టెక్నాలజీ గురించి ఇటీవల సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. డీప్‌ఫేక్ అవకాశాలు ఎక్కువనే ఆందోళనలు సైతం వ్యక్తం అయ్యాయి. అయితే ప్రస్తుతం నానో బనానా 2 కూడా అందుబాటులోకి వచ్చింది. ఫిబ్రవరి 2026లో లాంచ్ అయింది. నిజానికి ఇది గూగుల్ డీప్‌మైండ్‌కు సంబంధించిన జెమిని 3.1 ఫ్లాష్ ఇమేజ్ మోడల్‌కు చెందిన అంతర్గత ప్రాచుర్యం పొందిన పేరు. జెమిని ఏఐ (Gemini AI)కు సంబంధించి అత్యాధునిక ఇమేజ్ జనరేషన్ & ఫొటో ఎడిటింగ్ టూల్ కూడాను.
ప్రయోజనాలు
నానో బనాన 2 (Nano Banana 2) అనేది మునపటి వెర్షన్ అయిన నానో బనానా ప్రో(Nano Banana Pro)కు చెందిన అధునాత ఫీచర్లను కలిగి ఉంది కాబట్టి అత్యధిక వేగంతో నిమిషాల్లో హై క్వాలిటీ ఫొటోలు, ఫొటో ఎడిట్స్‌ను జనరేట్ చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇక ఈ సాంకేతికత ప్రయోజనాల విషయానికి వస్తే.. ఫ్లాష్ (Flash) స్పీడ్‌లో హై-క్వాలిటీ ఇమేజెస్‌లను సెకన్లలో క్రియేట్ చేస్తుంది. నాణ్యత విషయానికి వస్తే ప్రో లెవెల్ రీజనింగ్, వరల్డ్ నాలెడ్జ్ (రియల్-టైమ్ సెర్చ్ గ్రౌండింగ్), ఫిజిక్స్-అక్యురేట్ లైటింగ్, బెటర్ టెక్స్ట్ రెండరింగ్ వంటి ఫీచర్లతో అద్భుతంగా పనిచేస్తుంది. ఒకే క్యారెక్టర్ లేదా ఆబ్జెక్ట్‌లను మల్టిపుల్ ఇమేజెస్‌లోనూ నిలుపుతుంది. కాబట్టి స్టోరీ బోర్డింగ్, ఎడిటింగ్ వంటి వాటికి కూడా ఉపయోగం. అంటున్నారు సాంకేతిక నిపుణులు. మార్కెటింగ్, డిజైన్, కంటెంట్ క్రియేషన్, ప్రొడక్ట్ మాకప్స్ వంటి ప్రొఫెషనల్ వర్క్‌కి నానో బనానా 2 సూపర్ సెట్ అంటున్నారు సాంకేతిక నిపుణులు.
నష్టాలు-పరిమితలు
*కొన్నిసార్లు తప్పుడు డీటెయిల్స్ లేదా అసంబద్ధమైన ఇమేజెస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఏఐ హాల్యూసినేషన్స్ వల్ల జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఫ్రీ యూజ్‌లో తక్కువ ఫీచర్లు, లిమిట్స్ ఉంటాయి. పెయిడ్/ప్రీమియం యూజ్‌లో అయితే పూర్తి ఫీచర్లు ఉంటాయి.
*టెక్నాలజీని మంచికోసం వినియోగించుకుంటే మంచిదే కానీ.. మిస్ యూజ్ చేస్తే నష్టం. నానో బనానా 2 కూడా అంతే.. దీనిని సరిగ్గా వాడుకోకపోతే ఎథికల్/లీగల్ ఇష్యూస్ వస్తాయి. ముఖ్యంగా డీప్‌ఫేక్స్, కాపీరైట్ సమస్యలు, మిస్ యూజ్‌లకు అవకాశం ఇవ్వకూడదంటున్నారు నిపుణులు. కొన్ని సందర్భాల్లో ఇమేజ్ రెఫరెన్స్ లేదా క్వాలిటీ ఇష్యూస్ కూడా రావచ్చు. అయితే ఇతర ఏఐ మోడల్స్ మాదిరిగానే ఎక్కువగా ఉపయోగించడంవల్ల క్రియేటివిటీ తగ్గడం లాంటి సాధారణ సమస్యలు ఎదురవుతాయి.






