- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Being alone : ఒంటరిగా ఉండటం బలహీనత కాదు.. బలమైన ఆయుధం!
Being alone : ఒంటరిగా ఉండటం బలహీనత కాదు.. బలమైన ఆయుధం!

దిశ, ఫీచర్స్ : కొందరు తరచుగా ఒంటరిగా లేదా ఏకాంతంగా ఉండేందుకు ఎక్కువ ఇష్టపడుతుంటారు. ఏ శబ్దమూలేని ఏకాంత ప్రదేశాల్లో ప్రశాంతంగా విహరిస్తూ ఆనంద పడుతుంటారు. నిజం చెప్పాలంటే ఈ అలవాటు ఒక వ్యసనం లాంటిదని కూడా కొందరు చెబుతుంటారు. కానీ అది మీలో మానసిక దృఢత్వాన్ని పెంచే పవర్ ఫుల్ వెపన్ లాంటిదని కూడా మానసిక నిపుణులు చెబుతున్నారు. ‘నిజానికి ఒంటరితనం మిమ్మల్ని బలంగా మార్చేస్తుంది. ఆందోళన, ఒత్తిడి వంటి సమస్యలను సైతం మీరు గడిపే నిశ్శబ్ద వాతావరణం దూరం చేస్తుంది. ఆలోచనల్లో ఒక క్లారిటీ వస్తుంది. జీవితం పట్ల స్పష్టత ఏర్పడుతుంది. ప్రశాంతంగా, మనసు తేలిగ్గా అనిపిస్తుంది’ అంటున్నారు నిపుణులు.
లోలోన బాధపడుతూ.. పైపైకి ‘ప్లాస్టిక్ నవ్వు’లతో అందరినీ సంతోష పెట్టడానికి ప్రయత్నించే వారికంటే.. తమకంటూ పర్సనల్ స్పేస్‌ను క్రియేట్ చేసుకునే ఒంటరితనమే మీకు మేలు చేస్తుందంటున్నారు నిపుణులు. పైగా ఇక్కడ అర్థ రహిత సంభాషణలకు అవకాశం ఉండదు. అలాంటి ఆలోచనలను మీరు యాక్సెప్ట్ చేయరు. సొంతంగా ఆనందించడం, ఆలోచించండం, సమాజాన్ని అర్థం చేసుకోవడం, సమాజం నుంచి గ్రహించడం, నేర్చుకోవడం ఎలాగో కూడా ఏకాంతంగా లేదా ఒంటరిగా ఉన్నప్పుడు నేర్చుకునే అవకాశం ఎక్కువ. అందుకే ఒంటరితనాన్ని (Solitude ) కోరుకునే వ్యక్తులు స్థిరమైన సహవాసాన్ని (Constant companionship) దాదాపు కోరుకోరు. తమ లక్ష్యాలను చేరుకోవడం గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. అందుకే ఒంటరిగా లేదా ఏకాంతంగా గడిపేందుకు తమకంటూ ప్రత్యేక సమయాన్ని కోరుకోవడం సదరు వ్యక్తుల బలహీనత ఏమాత్రం కాదు. పైగా అది వారిని బలంగా మార్చే ఆయుధం లాంటిదని, అనేక విషయాల్లో సమస్యల పరిష్కారానికి మార్గమని మానసిక నిపుణులు చెబుతున్నారు. Link






