- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మనం రోజూ పట్టించుకోని ప్రేమలు ఎన్నో.. మూల మలుపు.. కాఫీ టేబుల్..
దాదాపు ప్రతి ఒక్కరి లైఫ్‌లో లవ్ చాప్టర్ ఉండే ఉంటుంది. వన్ సైడ్ లవ్.. టు సైడ్స్.. ట్రయాంగిల్ లవ్ స్టోరీ.. లాంటి ఎక్స్‌పీరియన్స్ ఉండే ఉంటుంది. లక్కీగా కొందరి ప్రేమ ఫలించి ఒక్కటైతే.. ఇంకొందరు అనివార్య కారణాల వల్ల విడిపోతారు.

దిశ, ఫీచర్స్ : దాదాపు ప్రతి ఒక్కరి లైఫ్‌లో లవ్ చాప్టర్ ఉండే ఉంటుంది. వన్ సైడ్ లవ్.. టు సైడ్స్.. ట్రయాంగిల్ లవ్ స్టోరీ.. లాంటి ఎక్స్‌పీరియన్స్ ఉండే ఉంటుంది. లక్కీగా కొందరి ప్రేమ ఫలించి ఒక్కటైతే.. ఇంకొందరు అనివార్య కారణాల వల్ల విడిపోతారు. బ్రేకప్ చెప్పేసుకుంటారు. ఈ క్రమంలో కొందరు ఒంటరిగా మిగిలిపోతారు. ఇంకొందరు వెంటనే మూవ్ ఆన్ అయితే.. మరికొందరు కాస్త టైమ్ తీసుకుంటారు. అయితే లవ్‌ను సీరియస్‌గా తీసుకున్న కొందరు మెంటల్‌గా డిస్టర్బ్ అయిపోతారు. ప్రేమ జోలికే పోవద్దని నిర్ణయించుకుంటారు. కానీ మన డెయిలీ లైఫ్‌లో కూడా చాలా ప్రేమలు ఉన్నామనే సంగతి మరిచిపోతున్నామని అంటున్నారు ఇలాంటి వారే. లవ్ కేవలం లస్ట్‌గానే మిగిలిపోవడం చూస్తున్నాం కానీ రోజువారీ జీవితంలో చాలా గొప్ప ప్రేమలు దాగున్నాయని ఉదాహరణలు అందిస్తున్నారు.
* మనం ఒక పుస్తకం లేదా ప్రదేశంతో ప్రేమలో మునిగిపోవడం..వాటిని ఆస్వాదిస్తూ నిరాశ, ఆందోళన నుంచి రిలీఫ్ అవుతుంటాం.
* ప్రశాంతమైన వాతావరణంలో కాఫీ సువాసన ఎంతటి అనుభూతిని పంచుతుందో మాటల్లో చెప్పక్కర్లేదు. ఉదయం కప్పు కాఫీ తాగడం.. ఆ క్షణంతో ప్రేమలో పడటం. ఇది ప్రేమ వలె తాత్కాలికమైనది కానీ గొప్ప ఆధ్యాత్మిక లోతును కలిగి ఉంటుంది.
* టమోటాలు సరిగ్గా లేవని కూరగాయల వ్యాపారికి చెప్పినప్పుడు.. మీకోసమే ప్రత్యేకంగా మంచి టమోటాలు తీసుకురావడం. కస్టమర్‌గా మిమ్మల్ని, మీ నమ్మకాన్ని కోల్పోకూడదనే భావనలోనూ పవిత్ర ప్రేమ దాగి ఉంది.
* అలసటను తగ్గించడానికి అత్యంత రుచికరమైన వంట చేసే కుక్ కూడా మీ మంచి, ప్రేమను కోరుకునేవాడే.
* తల్లిదండ్రులు, కుటుంబంతో సినిమా చూడటానికి, లేదా బయటకు వెళ్లడం.
* మీ సంతోషం కోసం ఏదైనా హ్యాబిట్ ఫాలో కావడం.






