ఈ పండు ఆకులతో కామెర్లను తగ్గించుకోవచ్చని తెలుసా..

by Disha Web Desk 10 |
ఈ పండు ఆకులతో కామెర్లను తగ్గించుకోవచ్చని తెలుసా..
X

దిశ, ఫీచర్స్: కామెర్లు వ్యాధి ఎంత ప్రమాదకరమో మనకి తెలిసిందే. దీనికి తక్షణమే చికిత్స చేయకపోతే ప్రాణం పోయే అవకాశం ఉంది. కిడ్నీ వ్యాధి వల్ల ఈ సమస్య వస్తుంది. ఇంకో విషయం ఏంటంటే .. ఇది ఒక్క రోజులో తగ్గిపోయేది కాదు.. కొన్ని నెలల కఠిన నియమాలు పాటించాల్సిందే. కామెర్లు యొక్క లక్షణాలు ప్రధానంగా కళ్ళలో కనిపిస్తాయి. అంటే కళ్ళు పచ్చగా మారిపోతాయి. అయితే, ఈ వ్యాధిని మందులతో కాకుండా పండ్లతో నయం చేసుకోవచ్చని చాలా మందికి తెలీదు. ఈ ఎర్రటి పండు కామెర్లతో పోరాడగలదా ? లేదా అని సందేహిస్తున్నారా? అలాంటి సందేహం అవసరం లేదు.. దీనితో కామెర్లను తగ్గించుకోవచ్చు. ఎలాగో ఇక్కడ చూద్దాం..

మార్కెట్‌లో మనం తరచుగా చూసే పండ్లు యాపిల్, దానిమ్మ. దానిమ్మ తక్కువ ధరకే లభిస్తుంది. అయితే, ఇది కామెర్లకు ఇది చెక్ పెట్టగలదు. నిజానికి దానిమ్మపండులోనే కాదు, దాని తొక్కలో కూడా ఔషధ గుణాలున్నాయి. ఇది తరచుగా ఆయుర్వేదంలో కూడా ఉపయోగిస్తారు. పిల్లలు, పెద్దలు ఇద్దరూ ఈ పండును తినడానికి ఇష్టపడతారు. ఎందుకంటే, ఇందులో విటమిన్లు, పోషకాలు ఉంటాయి.

ఇప్పటివరకు మనం దానిమ్మ పండ్లు, వాటి పై తొక్క గురించి మాట్లాడుకున్నాము. ఈ చెట్టు ఆకుల వల్ల కూడా మన ఆరోగ్యానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ ఆకులను కషాయం చేసుకుని తాగడం వలన కామెర్లు తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి తీసుకోబడింది. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.


Next Story

Most Viewed