నిద్రపట్టట్లేదా..? పడుకోవడానికి గంట ముందు ఈ పండు తింటే గుర్రు పెట్టి నిద్రపోతారంతే..!

by Javid Pasha |   (  Updated:2025-07-24 11:33:58  IST  )

నిద్రపట్టట్లేదా..? పడుకోవడానికి గంట ముందు ఈ పండు తింటే గుర్రు పెట్టి నిద్రపోతారంతే..!

నిద్రపట్టట్లేదా..? పడుకోవడానికి గంట ముందు ఈ పండు తింటే గుర్రు పెట్టి నిద్రపోతారంతే..!
X

దిశ, ఫీచర్స్ : నిద్రలేమి.. అనేక ఆరోగ్య సమస్యలకు ప్రధాన కారణాల్లో ఇది కూడా ఒకటి. అయితే ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్న వారికి పెద్దగా ఖర్చులేని ఒక అద్భుతమైన పరిష్కారం ఉందంటున్నారు నిపుణులు. ఏంటంటే.. న్యూట్రిషన్ అండ్ హెల్త్ జర్నల్‌లో పబ్లిషైన ఒక రీసెర్చ్ వివరాల ప్రకారం.. నిద్రవేళకు ఒక గంట ముందు ఒకటి లేదా రెండు కివీ పండ్లు (Kiwi Fruit) తినడం క్రమంగా నిద్రలేమి సమస్యను దూరం చేస్తుంది.

అధ్యయనంలో భాగంగా నాలుగు వారాల పాటు ప్రతి రోజు రాత్రి నిద్రవేళకు ఒక గంట ముందు కివీ పండ్లను తినడం వల్ల ఎలైట్ అథ్లెట్లలో స్లీప్ క్వాలిటీ మెరుగుపడిందని నిపుణులు గుర్తించారు. నిద్రలేమి సమస్యను ఎదుర్కొంటున్నవారిలో సైతం అదనంగా నిద్ర సామర్థ్యం (Sleep efficiency) 86% నుండి 93%కి మెరుగుపడిందని పేర్కొన్నారు. కివీ పండులో మెలటోనిన్, సెరోటోనిన్, అండ్ యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల నిద్ర-మేల్కొనే చక్రాన్ని(sleep-wake cycle) సరిగ్గా కంట్రోల్ చేయడంలో సహాయపడతాయని పరిశోధకులు కనుగొన్నారు.

Next Story