High Blood Pressure: హైబీపీని తగ్గించే జ్యూస్లు ఇవే !

by Disha Web Desk 10 |
High Blood Pressure: హైబీపీని తగ్గించే జ్యూస్లు ఇవే !
X

దిశ, ఫీచర్స్ : జీవనశైలిలో మార్పులు, పలు రకాల మానసిక ఒత్తిళ్ల కారణంగా ఈ రోజుల్లో హైబీపీ సమస్య చాలామందిలో పెరుగుతోంది. ఇది గుండె జబ్బులు, డయాబెటిస్‌లతో పాటు అనేక రకాల అనారోగ్యాలకు కారణం అవుతోంది. అయితే కొన్ని రకాల పండ్ల జ్యూస్ తీసుకోవడంవల్ల హైబీపీ సమస్యలను నివారించవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అవేమిటో తెలుసుకుందాం.

బీట్‌రూట్‌ జ్యూస్ :

బీట్ రూట్‌లో యాంటీ ఆక్సిడెంట్, విటమిన్లు, కాల్షియం, ఐరన్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు ఉంటాయి. అంతేగాక ఇమ్యూనిటీ పవర్‌ను పెంచడంలో, బీపీని కంట్రోల్ చేయడంలో, హిమోగ్లోబిన్‌ను పెంచడంలో ఇది సహాయపడుతుంది. అధిక బరువు సమస్యను నివారిస్తుంది.

దానిమ్మ జ్యూస్ :

విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్, ఐరన్, ఫోలేట్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు కలిగి ఉండటంవల్ల దానిమ్మ జ్యూస్ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. రోగ నిరోధక వ్యవస్థ బలపడి వివిధ రకాల వ్యాధులు రాకుండా పోరాడుతుంది.

టమోటా జ్యూస్

ఇందులో కాల్షియం, విటమిన్లు, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. జ్యూస్ తీయకుండా మామూలుగా కూడా టమోటాలు తినవచ్చు. రోజూ ఒక గ్లాసు టమోటా జ్యూస్ తాగితే బీపీ అదుపులో ఉంటుంది. గుండె ఆరోగ్యానికి మంచిది.

Read More: గుండె జబ్బులకు దారితీస్తున్న ట్రాన్స్ ఫ్యాట్ ఫుడ్స్ ! అదెలాగంటే..

Next Story

Most Viewed