గుండె జబ్బులకు దారితీస్తున్న ట్రాన్స్ ఫ్యాట్ ఫుడ్స్ ! అదెలాగంటే..

by Disha Web Desk 12 |
గుండె జబ్బులకు దారితీస్తున్న ట్రాన్స్ ఫ్యాట్ ఫుడ్స్ ! అదెలాగంటే..
X

దిశ, ఫీచర్స్: మారుతున్న జీవన శైలి, కొన్ని రకాల ఆహారపు అలవాట్లు గుండె జబ్బులు పెరగడానికి కారణం అవుతున్నాయని వైద్య నిపుణులు అంటున్నారు. ఏటా ప్రపంచవ్యాప్తంగా 5 వందల(5 బిలియన్లు) కోట్లమంది ప్రజలు ట్రాన్స్ ఫ్యాట్‌కు ప్రభావితం అవుతున్నారని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నివేదికలు చెప్తున్నాయి. ఒక విధంగా ఇది ఆందోళన కలిగించే విషయమని నిపుణులు చెబుతున్నారు.

ట్రాన్స్ ఫ్యాట్స్‌ను, ట్రాన్స్-ఫ్యాటీ యాసిడ్స్ అని కూడా పేర్కొంటారు. ఈ ఆహారాలు శరీరంలో బ్యాడ్ కొలెస్ర్టాల్‌ను పెంచుతాయి. గుడ్ కొలెస్ట్రాల్‌ స్థాయిని తగ్గిస్తుంది. ట్రాన్స్ ఫ్యాట్స్‌ ఫుడ్స్ తరచుగా తీసుకోవడంవల్ల గుండె జబ్బులు, స్ర్టోక్ వంటి సమస్యలకు దారి తీస్తాయి.

ఏయే పదార్ధాల్లో ఉంటుంది..?

వైద్య పరిభాషలో ట్రాన్స్-ఫ్యాట్ అనేది అసంతృప్త కొవ్వు రకం, ఇది సహజమైన లేదా కృత్రిమ ఆహారాల ద్వారా కూడా వస్తుంది. ముఖ్యంగా ప్యాకేజ్డ్ ఫుడ్స్(పిజ్జా, బర్గర్, దిల్ పసంద్, ప్యాకేజ్డ్ చికెన్), ఎక్కువగా నిల్వచేసి వాడుకునే ఆహార పదార్థాలు, వంట నూనెల్లో ఉంటుంది. దీనివల్ల శరీరంలో కొవ్వు పెరిగి గుండె జబ్బులకు, రక్తనాళాల సమస్యకు దారి తీస్తుంది.

స్లో పాయిజన్ లాంటిది

నిజంగా చెప్పాలంటే ట్రాన్స్ ఫ్యాట్ అనేది విష రసాయనం లాంటిది. మనుషులను అది తీవ్రమైన అనారోగ్యాలకు, నరాల వ్యాధులకు గురిచేస్తుంది. డబ్ల్యుహెచ్‌వో డైరెక్టర్ జనరల్ డా. టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ వివరణ ప్రకారం.. ట్రాన్స్ ఫ్యాట్ వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండకపోగా, ఆరోగ్యానికి ప్రమాదాన్ని తెచ్చిపెడతాయి. ఒక విధంగా ఇది స్లో పాయిజన్ లాంటిది. తినే ఆహారంలో కొవ్వు శాతం అధికంగా కలిగిన ట్రాన్స్ ఫ్యాట్స్ తీసుకోకపోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.

డబ్ల్యుహెచ్‌ఓ ఏం చెప్తోంది

వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ 2018 రిపోర్టు ప్రకారం 2023 సంవత్సరం నాటికి ట్రాన్స్ ఫ్యాట్స్ ఫుడ్స్‌ను ప్రజలు తమ ఆహారంలో లేకుండా తొలగించుకోవాలి. దాదాపు 43 దేశాలు ఆహారంలో ట్రాన్స్-ఫ్యాట్‌లను తగ్గించే చర్యలు చేపడుతున్నాయి. ఎందుకంటే ట్రాన్స్ ఫ్యాట్స్ శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. గుండె జబ్బులు, స్ర్టోక్ వంటి సమస్యలకు దారి తీస్తాయి.

గుండె జబ్బులు, ట్రాన్స్ ఫ్యాట్ కారణంగా ప్రజలకు ప్రాణహాని సంభవించే ప్రమాదం కలిగిన జాబితాలోని 16 దేశాలుండగా వీటిలో 9 దేశాలు వాటి నివారణ దిశగా ఆలోచించడం లేదని, గుండె జబ్బుల విషయంలో అవి ప్రమాదపు అంచుల్లో ఉన్నాయని డబ్ల్యూహెచ్ఓ 2018లోనే తన రిపోర్టులో పేర్కొన్నది. ఇందులో భూటాన్, ఈక్వెడార్, ఈజిప్ట్, ఇరాన్, ఆస్ట్రేలియా, అజర్‌బైజాన్, నేపాల్, పాకిస్థాన్, దక్షిణ కొరియా దేశాలు ట్రాన్స్ ఫ్యాట్ ఆహారం వాడుతున్న వాటి జాబితాలో డేంజరస్ జోన్‌లో ఉన్నాయి.

Read More: హైబీపీని తగ్గించే జ్యూస్లు ఇవే !



Next Story

Most Viewed