Neem: వేప క్యాన్సర్ కు చెక్ పెడుతుందా.. దీనిలో నిజమెంత?

by Phanindra |

పరిశోధకలు ప్రయోగాలు చేసి షాకింగ్ ఫాక్ట్స్ ను వెల్లడించారు.

Neem: వేప క్యాన్సర్ కు చెక్ పెడుతుందా.. దీనిలో నిజమెంత?
X

దిశ, వెబ్ డెస్క్ : వేపలో ( Neem ) ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఇప్పటికి చాలా మంది వేపచెట్టు కింద నిద్రిస్తారు. ఈ తరం వారికీ వేప వలన ప్రయోజనాలు తెలియవనేది వాస్తవం. వామ్మో ఇదేంటి ఇంత చేదుగా ఉందంటూ వెంటనే పారేస్తారు. చెట్టు మొదటి నుంచి వేప బెరడు, ఆకు, పువ్వు, పండు ఇలా అన్నింటిని ఔషధాలకు వాడతారు. ఇక , ఉదయం లేవగానే వేప పుల్లతో కొందరు పళ్ళు తోముకుంటారు.

వేప చెట్టు ఉపయోగాలు తెలియక అందరూ దీనిని లైట్ తీసుకుంటారు. కాగా, హైదరాబాద్ పరిశోధకలు కొన్ని ముఖ్య విషయాలను వెల్లడించారు. నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఫార్మాసూటికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ పరిశోధకలు ప్రయోగాలు చేసి షాకింగ్ ఫాక్ట్స్ ను వెల్లడించారు. వేపాకుల్లో, పువ్వుల్లో ఉండే నింబోలైడ్‌ అనే రసాయనం, కొన్ని రకాల క్యాన్సర్ ( Cancer ) సమస్యలకు చెక్ పెడుతుందని తెలిపారు.

నింబోలైడ్‌కు క్యాన్సర్ ను తగ్గించే లక్షణాలు ఉన్నాయని 2014లో నిపుణులు గుర్తించారు. ఈ రసాయానాన్ని క్యాన్సర్ ఉన్న ఎలుకలకు నోటి ద్వారా అందించినప్పుడు ఎలాంటి రిజల్ట్ రాలేదని, అదే ఇంజెక్షన్ రూపంలో నరాల్లోకి ఎక్కించి పరీక్షించగా కేన్సర్‌ కణితులు మాయమైనట్లు తెలిపారు. అయితే, ఇప్పుడు దీన్ని మనుషుల్లోనూ పరీక్షించేందుకు టెస్టులు చేస్తున్నారు.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి తీసుకోబడింది. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.

Next Story