- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Doctor's advice : నా కాపురాన్ని నిలబెట్టండి ప్లీజ్!!
సెక్స్ సమయంలో శీఘ్ర స్ఖలన సమస్యకు పరిష్కారాలు ఉన్నాయి. అంగ స్తంభన సమయాన్ని పెంచే సెక్స్ థెరపీలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి.

ప్రశ్న : మేడం.. నా వయసు 26 సంవత్సరాలు. పెళ్లి అయి సంవత్సరం అయింది. కానీ భార్యకి దూరంగా ఉంటున్నాను. ఇక నేను సెక్స్‌కి పనికిరానని ఆరోపిస్తూ నా భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. వాళ్లు పూర్తిగా పల్లెటూరి మనుషులు. నాకు అంగస్తంభన బాగానే ఉంది. కానీ అంగప్రవేశం కాకముందే వీర్య స్ఖలనం అయిపోతుంది. నా భార్య పుట్టింటి వాళ్లందరికీ నేను సెక్స్‌కి పనికి రానని చెప్పేసింది. వాళ్ల ఊర్లో పంచాయితీ పెట్టి ఇంకొక అమ్మాయితో సెక్స్ చేసి నిరూపించు అంటున్నారు. మా అమ్మానాన్నలకు, నాకు ఇది అస్సలు ఇష్టం లేదు. ఈ పద్ధతిలో కాకపోతే విడాకులు అంటున్నారు. నన్ను ఏం చేయమంటారు ? - ఎస్ .ఎస్.నల్గొండ
జవాబు : చాలామంది శీఘ్ర స్ఖలన సమస్యను అంగస్తంభన సమస్యగా చూస్తారు. ఉద్రేకం, భయం, ఆందోళనలతో కూడిన మానసికస్థితి.. వీర్యాన్ని కలిగించే సెక్స్ కండరాల మీద నియంత్రణ కోల్పోయేలా చేస్తుంది. కొన్ని శారీరక వ్యాధులు కూడా దీనికి కారణం. ఇవన్నీ కలిపి వీర్యం క్షణాల్లో స్ఖలనం అవుతుంది. ఇలా అవటం ఆందోళన, భయాలకు దారి తీస్తుంది. సెక్స్ సమయంలోనే ఆందోళనని తగ్గించి, స్ఖలనాన్ని నియంత్రించే సెక్స్ కండరాల మీద పటుత్వాన్ని పెంచి.. అంగస్తంభన కాలాన్ని పెంచే ఎక్సర్సైజులు సెక్స్ థెరఫీలో ఉన్నాయి. మీకు అంగస్తంభన సమస్య లేదు. మీ అంగస్తంభన సమస్య స్థితిని తెలిపే వైద్య పరీక్షలు ఉన్నాయి. సెక్స్ హార్మోన్ల స్థాయి అంగంలో రక్త సరఫరాన్ని తెలిపే పెనయిల్ స్క్రోటల్ కలర్ డాప్లర్ చేయించుకొని.. అవి సాక్ష్యంగా చూపిస్తే చాలు. అంతేకానీ నాలుగు గోడల మధ్య భార్యతో మాత్రమే చేసే శృంగారం బహిరంగంగా మరో స్త్రీతో చేయమనడం దుర్మార్గం. అనైతికం.. అనాగరికం. దీనికి మీరు ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆ సమయంలో అందరూ చూస్తుండగా.. భయం, ఆందోళనలతో అస్సలు అంగస్తంభనే కలగదు. మీరు మీ అత్త,మామ, భార్యలతో మంచి సెక్సాలజిస్ట్ నీ కలిస్తే పైపరీక్షలు చేయించి అందరికీ కౌన్సిలింగ్ ఇచ్చి సమస్యను పరిష్కరిస్తారు.
- డాక్టర్ భారతి
సెక్సువల్ హెల్త్ &ఫ్యామిలీ కౌన్సెలర్
ప్రీ & పోస్ట్ మేరేజ్ &
సెక్సువల్ కౌన్సెలింగ్
86885 19225






