Boys Hands In Pockets: మగవాళ్ళు చేతులు జేబులో ఎందుకు పెట్టుకుంటారో తెలుసా.. దాని వెనక దాగి ఉన్న రహస్యం ఇదే..!

by Phanindra |   (  Updated:2025-01-20 07:52:02  IST  )

అలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండేందుకు ఇలా ప్రదర్శిస్తాడని

Boys Hands In Pockets: మగవాళ్ళు చేతులు జేబులో ఎందుకు పెట్టుకుంటారో తెలుసా.. దాని వెనక దాగి ఉన్న రహస్యం ఇదే..!
X

దిశ, వెబ్ డెస్క్ : సాధారణంగా అబ్బాయిలు జేబులో చేతులు పెట్టుకుని నడుస్తూ ఉండటం మీరు చూసే ఉంటారు. అలా ఎందుకు నడుస్తారో ఎవరికీ అర్ధం కాదు .. దాని గురించి చాలా మందికి తెలియదు. అయితే, ఇలా నడవడం వెనక పెద్ద రహస్యమే దాగి ఉంది. అదేంటో ఇక్కడ చూద్దాం..

ఒక వ్యక్తి నడుస్తున్నప్పుడు వారి చేతులను పెట్టుకునే విధానం బట్టి వారి భావాలను చెప్పొచ్చని నిపుణులు చెబుతున్నారు. కొందరు ఏ పని లేనప్పుడు విశ్రాంతి పొందడం కోసం ఇలా చేస్తుంటారు. ఇంకొందరు బయటకు వెళ్ళిన ప్రదేశం నచ్చనప్పుడు కూడా తమ చేతులు దాచుకుంటారు. ఇలా చేయడం వలన వారిలో భయం తగ్గుతుంది. అలాగే, మానసికంగా టెన్షన్‌ని తగ్గించుకుని ప్రశాంతంగా ఉండేందుకు చేసే ప్రయత్నమే అని నిపుణులు చెబుతున్నారు.

ఎప్పుడైనా కొత్త ప్రదేశానికి వెళ్లినప్పుడు తమని తాము కంట్రోల్ చేసుకునేందుకు ఇలా చేతులను జేబులో పెట్టుకుని నడుస్తుంటారు. ఇంకా ఇష్టం లేని పనుల్లో ఆ వ్యక్తి పాల్గొనకూడదని, అలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండేందుకు ఇలా ప్రదర్శిస్తాడని నిపుణులు పరిశోధనలు చేసి వెల్లడించారు.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి తీసుకోబడింది. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.

Next Story