పూజ ముగిసిన తర్వాతే హారతి ఎందుకు ఇస్తారో తెలుసా?

by Dishanational2 |
పూజ ముగిసిన తర్వాతే హారతి ఎందుకు ఇస్తారో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్: దేవుని వద్ద పూజ చేయడం అనేది చాలా కామన్.ఏ ఆలయంలోనైనా సరే, ఏదైనా శుభకార్యం చేసినా సరే పూజ చేసిన తర్వాత హారతి ఇస్తుంటారు. అయితే అసలు దేవునికి పూజ చేసిన తర్వాత హారతి ఎందుకు ఇస్తారో చాలా మందికి తెలియదు.దీని వెనుక ఓ రహస్యం ఉన్నదంట. అది ఏమిటంటే?పూజ చేసిన తర్వాత హారతి ఇస్తేనే పూజ సంపూర్ణం అయినట్లంట..

ఒకప్పుడు ఆలయాలలో ఎలాంటి కృత్రిమమైన దీపాలూ ఉండేవి కావు. పైగా గాలి తగలకుండా రాతితో ఆ నిర్మాణాలు సాగేవి. అలాంటి ప్రదేశాలలో తేమ అధికంగా ఉండటం సహజం. దీంతో దుర్వాసన, సూక్ష్మక్రిములు దరిచేరక తప్పదు. కర్పూరానికి సూక్ష్మక్రిములను సంహరించే శక్తి, అంటువ్యాధులను నివారించే గుణం ఉన్నాయని ప్రాచీన వైద్యుల నమ్మకం. అందుకని దేవాలయాలలో కర్పూరంతో దీపాలు వెలిగిస్తారని సమాచారం.

Read More: అధిక బరువు తగ్గాలనుకుంటున్నారా?.. అయితే చిన్న ప్లేట్‌లో తినండి!

సోషల్ మీడియాలో ‘బాడీ ఇమేజింగ్’ ట్రెండ్స్... పిల్లలపై నెగెటివ్ ఎఫెక్ట్

Next Story

Most Viewed