- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Beer Bottles: బీరు బాటిల్స్ ఆ రంగులోనే ఎందుకు ఉంటాయో తెలుసా?
వీటిని మనం ఎక్కడ చూసిన ఒకే రంగులో కపినిస్తాయి.

దిశ, వెబ్ డెస్క్ : పార్టీ ఏదయినా అక్కడ బీర్ ( Beer) ఉండాల్సిందే. ఇది చేదుగా ఉన్నా యూత్ దీనిని ఇష్టంగా తాగుతారు. కొందరైతే బాటిల్స్ మీద బాటిల్స్ ఎత్తేస్తూనే ఉంటారు. ఇది మొదటిసారి తాగేవారికి చాలా చేదుగా అనిపిస్తుంది. తాగిన తర్వాత కొంచం మత్తుగా, తల తిరగడం వంటివి జరుగుతుంటాయి. కొన్ని సార్లు అయితే కొందరికి వాంతులు కూడా అవుతాయి. అయినా కూడా అదే పనిగా తాగుతుంటారు. అయితే, వీటిని మనం ఎక్కడ చూసిన ఒకే రంగులో కపినిస్తాయి. ఇవి ఒకే రంగులో కనిపించడానికి కారణాలేంటో తెలుసుకుందాం..
బీరు బాటిల్స్ ( beer bottles ) ఎక్కడైనా సరే.. బ్రౌన్ ( brown ) లేదా గ్రీన్ కలర్ లో ( green ) కనిపిస్తాయి. అయితే, ఇది ఇప్పటి నుంచి కాదు .. కొన్ని సంవత్సరాల నుంచి బీరు సీసాలు ఆ రెండు రంగుల్లోనే దర్శనమిస్తాయి. మీరు తీసుకోవడానికి ఎవరినైనా ఈ ప్రశ్న అడిగితే.. బాటిల్ ఏ కలర్ లో ఉంటే మనకెందుకు తాగడానికి రుచిగా ఉందా ? లేదా అనేది మాత్రం చూడాలి అని అంటారు. వాస్తవానికి టేస్ట్ రావడం కోసమే బీరు బాటిల్స్ ఈ రెండు కలర్స్ లో మాత్రమే తయారు చేస్తారని నిపుణులు చెబుతున్నారు. అలాగే, దీనిని కొన్నేళ్ల క్రితం సాధారణంగా ఉండే సీసాల్లోనే నిల్వ చేసేవారు.
అయితే, ఆ సీసాలకు సూర్య రశ్మి తగిలి బీరు టెస్ట్ మారిపోతుంది… అలాగే, యూవీ కిరణాలు వలన బీరు వాసన వస్తుంటుంది. ఒక రోజు గోధుమ రంగులో ఉండే బాటిల్స్ తయారు చేసి చాలా పరిశోధనలు చేశారు. దీంతో, చివరికి ఇది కనిపెట్టారు. ఎందుకంటే, ఈ యూవీ కిరణాలను బాటిల్స్ లోకి వెళ్లనివ్వదట. అలాగే బీరు కూడా మంచిగా ఉండటంతో అప్పటి నుంచి దీనిని వాడడం మొదలు పెట్టారు.
అలాగే, రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో గోధుమ రంగు సీసాలు ఎక్కడ లేకపోవడంతో పచ్చ రంగు బాటిల్స్ లో నింపడం మొదలు పెట్టారు. అయితే, ఈ గ్రీన్ కలర్ సీసాల్లో కూడా బీరు పాడవ్వకపోవడం… అలాగే టేస్ట్ కూడా మారకపోవడంతో బీరును ఈ బాటిల్స్ లోనూ నింపడం మొదలు పెట్టారు.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి తీసుకోబడింది. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.






