మందు బాటిల్ ఓ పెన్ చేస్తే ఎన్నిరోజుల వరకు దాన్ని తాగొచ్చో తెలుసా?

by Disha Web Desk 8 |
మందు బాటిల్ ఓ పెన్ చేస్తే ఎన్నిరోజుల వరకు దాన్ని తాగొచ్చో తెలుసా?
X

దిశ, ఫీచర్స్ : మందు బాబులం, మేము మందుబాబులం మందుకొడితే మాకు మేమే.. అనే సాంగ్ అందరూ వినే వింటారు. మద్యం లేనిదే ఇప్పుడు చాలా మంది ఉండటం లేదు. రోజు రోజుకు వైన్‌కు డిమాండ్ పెరుగుతంది. చిన్న మీటిగ్స్ నుంచి మొదలు పెడితే పెద్ద పెద్ద ఫంక్షన్స్ వరకు, ఏదీ లేకున్నా నడుస్తుంది కానీ, మందు లేకుండా ఏ పార్టీస్ జరగడం లేదంటే మద్యం డిమాడ్ ఎలా ఉందో అర్థం చేసుకోవాలి.

అయితే వైన్ షాప్స్‌ను చూస్తే చాలు ఎప్పటికీ కలకలలాడుతూ కనిపిస్తాయి. అయితే వైన్ షాప్స్‌లో ఉన్న మద్యం బాటిల్స్ ‌కు ఎక్స్‌పైరీ డేట్ ఉంటుందా..ఒక మందు బాటిల్ ఎన్ని రోజుల వరకు తాగొచ్చు అనే డౌట్ చాలా మందిలో ఉంటుంది.ఇక ఈ విషయంలోకి వెళ్లితే.. చాలా మంది వైన్స్‌కు అడెక్ట్ అవుతున్నారు.రోజూ తాగడమే కాకుండా,కొంత మంది బాటిల్ తీసుకొచ్చుకొని రోజుకు కొంచెం కొంచెంగా తాగుతుంటారు. అయితే దీన్ని ఓపెన్ చేసినప్పటి నుంచి ఎన్నిరోజులు తాగాలో ఇప్పుడు తెలుసుకుందాం. వైన్ అనేది ఎసిటిక్ యాసిడ్ స్థాయిలను పెంచుతుంది. ఇది వాస్తవానికి వైన్‌ను వెనిగర్‌గా మార్చగలదు. అయితే వైన్‌ను మూడు నుంచి ఐదురోజుల వరకు తాగడానికి అనుకూలంగా ఉంటుంది.

ఇక యువత ఎక్కువ తాగే, బీర్ ఎక్స్ పైరీ డేట్ మద్యం కంటే ముందుగా ముగుస్తుందంట. సాధారణంగా బీర్ గడువు కాలం ఆరు నెలలు. ఇక బీర్ టిన్ లేదా బాటిల్ అయినా.. ఒకసారి ఓపెన్ చేస్తే ఒకటి లేదా రెండు రోజుల్లో పూర్తి చేయాలి. దానిని ఓపెన్ చేసినప్పుడు.. గాలిలోని ఆక్సిజన్ బీర్‌తో సంకర్షణ చెందుతుంది. దీంతో అది చెడు రుచిని కలిగిస్తుంది.

Next Story

Most Viewed