పశ్చిమ బెంగాల్‌ నందిగ్రామ్‌లో బీజేపీ మహిళా కార్యకర్త హత్య.. ఉద్రిక్తతంగా మారిన పరిస్థితులు

by Harish |
పశ్చిమ బెంగాల్‌ నందిగ్రామ్‌లో బీజేపీ మహిళా కార్యకర్త హత్య.. ఉద్రిక్తతంగా మారిన పరిస్థితులు
X

దిశ, నేషనల్ బ్యూరో: మే 25న జరగనున్న ఆరో దశ ఎన్నికలకు ముందు పశ్చిమ బెంగాల్‌ పుర్బా మేదినీపూర్ జిల్లాలోని నందిగ్రామ్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తాజాగా ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత బుధవారం రాత్రి సమయంలో బీజేపీ కార్యకర్తల ఇళ్లపై కొంతమంది దాడులు చేశారు, ఈ ఘటనలో బీజేపీకి చెందిన మహిళా కార్యకర్త 38 ఏళ్ల రథిబాలా అర్హిని చనిపోయింది. అలాగే చాలా మందికి గాయాలయ్యాయి. ఈ సంఘటన రాష్ట్రంలో రాజకీయ దుమారానికి దారితీసింది. ఈ దాడిని అధికార టీఎంసీ కార్యకర్తలు చేశారని ఆరోపిస్తూ గురువారం బీజేపీ కార్యకర్తలు వీధుల్లోకి వచ్చి టైర్లను తగులబెట్టారు, చెట్లతో రోడ్లను దిగ్బంధించి నిప్పంటించారు.

జిల్లాలోని సోనాచురా ప్రాంతంలో పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీచార్జి చేయాల్సి వచ్చింది. హింసను నియంత్రించేందుకు ఎన్నికల సంఘం రాపిడ్ యాక్షన్ ఫోర్స్, సెంట్రల్ ఫోర్స్‌లను ఆ ప్రాంతంలో మోహరించింది. ఈ దాడి ఘటనపై బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మేఘనాధ్ పాల్ మాట్లాడుతూ, ఎన్నికల ప్రచారాలు ముగిసిన తర్వాత బుధవారం రాత్రి స్థానిక పోలింగ్ బూత్‌ను రక్షించే పనిని అర్హితో పాటు మరికొంత మంది కార్యకర్తలకు అప్పగించాం. వారిపై టీఎంసీ మద్దతున్న నేరగాళ్లు దాడి చేశారు. ఈ దాడిలో రథిబాలా అర్హిని హత్య చేయబడింది. మరికొంత మంది కార్యకర్తలకు తీవ్రగాయాలు అయ్యాయి. వారు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారని తెలిపారు.

ఈ ఘటనపై స్పందించిన అధికార టీఎంసీ నేత శాంతాను సేన్, నందిగ్రామ్‌లో రెండు బీజేపీ గ్రూపులు ఉన్నాయి. ఈ ఎన్నికల్లో టీఎంసీ చేతిలో ఓడిపోతామని బీజేపీకి తెలుసు. అందుకే వారు దీనిని ముందస్తు ప్రణాళికతో టీఎంసీకి అపకీర్తి తీసుకురావడానికి ఈ విధంగా చేశారని అన్నారు.

Next Story

Most Viewed