కేశినేని చిన్ని రుణం ఎప్పటికీ తీర్చుకోలేను: తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి

by srinivas |
కేశినేని చిన్ని రుణం ఎప్పటికీ తీర్చుకోలేను: తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి
X

దిశ, వెబ్ డెస్క్: విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని రుణం తాను ఎప్పటికీ తీర్చుకోలేనని తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి అన్నారు. అమరావతి ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన కొలికపూడి శ్రీనివాసరావు తిరువూరు నుంచి టీడీపీ నుంచి పోటీ చేసి ఎమ్మె్ల్యేగా గెలుపొందారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను తిరువూరులో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవడానికి కేశినేని చిన్నినే కారణమని చెప్పారు. చంద్రబాబు ఆశీర్వాదించారని, లోకేశ్ అవకాశం ఇచ్చారని తెలిపారు. రాజధానికి భూమిలిచ్చిన రైతులను జగన్ మోసం చేశారని మండిపడ్డారు. రాజధాని లేని రాష్ట్రానికి పెట్టుబడులు రావని, అప్పుడు ఉద్యోగులు కూడా రావని చెప్పారు. ఏపీకి చంద్రబాబు అవసరం చాలా ఉందన్నారు. నిరుద్యోగం, వెనుకబాటు తనం పరిష్కారానికి అమరావతే పరిష్కారమార్గమని చెప్పారు. రాజధాని నిర్మాణంతో వంద సమస్యలకు పరిష్కారం దొరుకుతుందన్నారు. అమరావతి నిర్మాణమే ఏపీ పునిర్మిర్మాణమని స్పష్టం చేశారు. పేదరిక నిర్మూలన, ఆర్థిక అభివృద్ధే తన లక్ష్యమన్నారు. జగన్‌కు తుగ్లక్ అని పేరు పెట్టింది తానేనని కొలికిపూడి శ్రీనివాసరావు తెలిపారు.Next Story

Most Viewed