Trending: లక్ష సర్వేలు వచ్చినా.. ఏపీలో ఆయన గెలుపును ఆపలేరు: వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు

by Shiva |
Trending: లక్ష సర్వేలు వచ్చినా.. ఏపీలో ఆయన గెలుపును ఆపలేరు: వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఏదో ఒక విషయం మీద సంచలన వ్యాఖ్యలు చేస్తూ.. నిత్యం వార్తల్లో నిలిచే జ్యోతిష్యుడు వేణు స్వామి మరో‌సారి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఏపీలో ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందనే విషయంపై కుండ బద్దలు కొట్టారు. లక్ష సర్వేలు వచ్చినా.. ఏపీలో జగన్ గెలుపును ఎవరూ ఆపలేరంటూ హాట్ కామెంట్స్ చేశారు. 2019 ఎన్నికల్లో జగన్ గెలిచినప్పుడు చంద్రబాబు మూడేళ్ల పాటు సైలెంట్‌గా ఉండాలని సలహా ఇచ్చానని చెప్పారు. చివరి రెండేళ్లలో మాత్రమే ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపుతూ ప్రజల్లోకి వెళ్లాలని చెప్పానంటూ గుర్తు చేశారు. జగన్ సీఎం కుర్చీలో కుర్చుంది మొదలు.. ప్రభుత్వం పడిపోతుందంటూ టీడీపీ ప్రచారం చేసిందని అదే ఇప్పుడు ఆ పార్టీకి మైనస్ అయ్యిందని అన్నారు. ఎన్నికల 2 నెలల ముందు కూడా టీడీపీకే గెలిచే అవకాశం ఉందని, ఆ పార్టీ మరో రెండు పార్టీలతో జత కట్టడం వల్లే సీన్ మొత్తం మారిందని అన్నారు. లక్ష సర్వేలు వచ్చినా.. ఎపీలో జగన్ గెలుపును ఎవరూ ఆపలేరని వేణు స్వామి అన్నారు.

Next Story

Most Viewed