మీ బాయ్‌ఫ్రెండ్/గర్ల్‌ఫ్రెండ్‌తో గాసిప్స్ పంచుకుంటున్నారా? తాజా అధ్యయనం ఏం చెబుతుందో తెలుసా?

by Yella Dhawani Reddy |

ముఖ్యంగా ఇద్దరు స్నేహితులు కలిసినా, ఆఫీసులో బ్రేక్ టైంలో సరదాగా మాట్లాడుకున్నా.. ఎవరో ఒకరిపై లేదా ఏదైనా అంశంపై గాసిపింగ్ చేయటం సర్వసాధారణం.

మీ బాయ్‌ఫ్రెండ్/గర్ల్‌ఫ్రెండ్‌తో గాసిప్స్ పంచుకుంటున్నారా? తాజా అధ్యయనం ఏం చెబుతుందో తెలుసా?
X

దిశ, వెబ్ డెస్క్: గాసిప్స్ (Gossips).. మనలో చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు. ముఖ్యంగా ఇద్దరు స్నేహితులు కలిసినా, ఆఫీసులో బ్రేక్ టైంలో సరదాగా మాట్లాడుకున్నా.. ఎవరో ఒకరిపై లేదా ఏదైనా అంశంపై గాసిపింగ్ చేయటం సర్వసాధారణం. అయితే, ఈ గాసిప్స్ నెగెటివ్‌గానే కాకుండా, కొన్నిసార్లు బంధాలను బలోపేతం చేసే సాధనంగా కూడా మారతాయట. తాజా జర్నల్ ఆఫ్ సోషల్ అండ్ పర్సనల్ రిలేషన్‌షిప్స్‌ అనే పత్రికలో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. భార్యాభర్తలు లేదా ప్రేమికుల గాసిప్స్ తమ బంధాన్ని మరింత బలంగా చేసేందుకు, వారి మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపర్చేందుకు సాయపడుతాయని వెల్లడైంది.

అమెరికాలోని యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా, రివర్సైడ్‌ (University of California, Riverside) పరిశోధకులు తాజాగా ఓ అధ్యయనాన్ని నిర్వహించారు. మొత్తం 76 మందిపై అధ్యయనంగా చేయగా.. వీరంతా తమ రోజువారీ సంభాషణలలో సుమారుగా 14 శాతం గాసిప్ సంబంధిత విషయాలుగా చర్చించుకుంటున్నట్లు గుర్తించారు. రోజుకు సగటున 38 నిమిషాలు గాసిప్ చేస్తే, అందులో సుమారు 29 నిమిషాలు తమ భాగస్వామితోనే గాసిప్ చేసినట్టు పరిశోధుకులు వెల్లడించారు. అంతేకాదు, ఈ అధ్యయనం గాసిప్ చేసే జంటలు, గాసిప్ చేయని జంటల కంటే ఎక్కువ ఆనందంగా, కలిసిమెలిసి ఉంటున్నారని తేల్చింది. ఇతరుల గురించి చిన్న చిన్న విషయాలు (స్నేహితులు, బంధువులు, సహచరుల గురించి) పంచుకోవడం వలన జంటల మధ్య సంబంధం మరింత లోతుగా మారుతూ, బంధం బలపడుతుందని గుర్తించింది. ఇలా గాసిప్స్ చేసుకోవటం వల్ల భాగస్వాములు ఇద్దరు ఒకే విధమైన అభిప్రాయాలను కలిగి ఉన్నామనే నమ్మకాన్ని పెంచుతుందని పేర్కొంది. అంతేకాకుండా, మహిళ- మహిళ జంటలు అత్యధికంగా గాసిప్ చేసినట్టు అధ్యయనంలో వెల్లడైంది.

Next Story