దంతాల అనారోగ్యం వృద్ధాప్యాన్ని వేగవంతం చేస్తుందా?

by Javid Pasha |

దంతాల అనారోగ్యం వృద్ధాప్యాన్ని వేగవంతం చేస్తుందని, మెదడును ప్రభావితం చేయడం ద్వారా జ్ఞాపక శక్తిని తగ్గిస్తుందని అధ్యయనం పేర్కొన్నది.

దంతాల అనారోగ్యం వృద్ధాప్యాన్ని వేగవంతం చేస్తుందా?
X

దిశ, ఫీచర్స్ : దంతాలను పూర్తిగా కోల్పోతే జ్ఞాపక శక్తి తగ్గుతుందని పెద్దలు చెబుతుంటారు. అయితే జపాన్‌లోని టోహోకు యూనివర్సిటీ శాస్త్రవేత్తలు నిర్వహించిన ఒక అధ్యయనం కూడా దీనిని రుజువు చేస్తున్నది. దీర్ఘకాలిక దంతాల అనారోగ్యం మానవుల్లో వృద్ధాప్యాన్ని వేగవంతం చేస్తుందని, మెదడును ప్రభావితం చేయడం ద్వారా జ్ఞాపక శక్తిపై ప్రభావం చూపుతుందని పేర్కొన్నది. ఇందుకు సంబంధించిన వివరాలు 2023లో అమెరికన్ అకాడమీ ఆఫ్ న్యూరాలజీ జర్నల్‌లోనూ పబ్లిష్ అయ్యాయి. ముఖ్యంగా చిగుళ్ల ఇన్‌ఫెక్షన్ (Periodontitis) ఎక్కువకాలం కొనసాగడం దీర్ఘకాలిక ఇన్‌ఫ్లమేషన్(నొప్పి)ను కలిగిస్తుందని, ఇది శరీరమంతా వ్యాపించి బ్రెయిన్ హిప్పోకాంపస్ క్షీణతకు కారణం అవుతుందని తెలిపింది.

స్టడీలో భాగంగా పరిశోధకులు 172 మంది వృద్ధులను 4 సంవత్సరాలపాటు ఫాలో చేసి, చిగుళ్ల వ్యాధి, అలాగే దంతాలు రాలిపోవడం మెదడులోని హిప్పోకాంపస్ (మెమరీ సంబంధితభాగం) క్షీణతను వేగవంతం చేస్తుందని కనుగొన్నారు. అంతేకాదు ఇది అల్జీమర్స్ రిస్క్‌ను పెంచుతుంది. ఇక దంతాల పూర్తిగా రాలిపోవడంవల్ల ఆహారం నమలడం తగ్గి, మెదడుకు ప్రేరణ(Brain stimulation)తగ్గి గుర్తుంచుకునే కాగ్నెటివ్ డిక్లైన్‌కు దారితీస్తుంది. అంతేకాకుండా శరీరాన్ని నిరంతర ఒత్తిడి, ఇన్‌ఫ్లమేషన్ స్థితిలో ఉంచుతుంది. ఇది మెదడు వృద్ధాప్యాన్ని వేగవంతం చేస్తుంది. అలాగే చిగుళ్లలోని బ్యాక్టీరియా(పి. గింగివాలిస్ వంటివి). చిగుళ్ల వ్యాధివల్ల వచ్చే ఇన్‌ఫ్లమేషన్ సైటోకైన్స్ విడుదల చేసి మెదడు కణాలను డ్యామేజ్ చేస్తుంది. ఫలితంగా శారీరక వృద్ధాప్యం కూడా వేగవంతమవుతుంది. అందుకే దంతాలను ఆరోగ్యంగా ఉంచుకోవాలని, దంత సమస్యలు వస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు.

*గమనిక : పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Next Story