Holi: తెలుగు రాష్ట్రాల్లో హోలీ సంబరాలు.. గోడలకు అంటిన రంగుల్ని ఈ చిట్కాలతో చెక్ పెట్టండి.?

by Kodari Anjali |   (  Updated:2025-03-14 14:55:25  IST  )

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో హోలీ(Holi) సంబరాలు ఘనంగా జరుపుకుంటున్నారు.

Holi: తెలుగు రాష్ట్రాల్లో హోలీ సంబరాలు.. గోడలకు అంటిన రంగుల్ని ఈ చిట్కాలతో చెక్ పెట్టండి.?
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో హోలీ(Holi) సంబరాలు ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ పండుగ చిన్నా పెద్దా అని తేడా లేకుండా అందరూ ఎంతో సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ ఫేస్టివల్‌ను ఉత్సాహంగా, ఉల్లాసంగా అంతా జరుపుకుంటారు. ప్రజలంతా ఎంతో ఆనందంగా ఒకరి మీద ఒకరు రంగులు చల్లుకుంటారు.

హోలీ ఆడుకుంటోన్న వారిని చూడానికి కూడా ఎంతో అద్భుతంగా అనిపిస్తుంటుంది. నేడు ఎక్కడ చూసినా గులాబీ, ఎరుపు, ఆకుపచ్చ రంగుల వర్షం కురుస్తున్నట్లుగా అనిపిస్తుంది. హోలీ ఆడేటప్పుడు ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది.

కానీ.. తర్వాత బట్టలకు పట్టన అలాగే గోడలకు పట్టిన రంగుల్ని తొలగించడానికి ఎంతో కష్టంగా అనిపిస్తుంటుంది. శరీరానికి అంటుకున్న కలర్స్ రెండ్రోజుల్లో పోతాయి. కానీ గోడలకు పట్టిన కలర్స్ పోవడం చాలా కష్టం. మరీ గోడలకు పట్టిన రంగుల్ని తొలగించడమెలాగో ఇప్పుడు తెలుసుకుందాం..

హోలీ రంగులు గోడ మీద పడితే.. బేకింగ్ సోడా ఉపయోగించండి. ముందుగా బేకింగ్ సోడాను వాటర్ లో కలిపి.. దీన్ని ఒక బాటిల్‌లో నిండి, మరకలు ఉన్న ప్లేస్‌లో స్ప్రే చేస్తే తొలగిపోతాయి. 15 నిమిషాల తర్వాత తడిబట్టతో గోడను తుడవండి. అంతే మరకలు ఈజీగా తొలగిపోతాయి. అలాగే వెనిగర్, నిమ్మరసం, టూత్ పేస్ట్ సహాయంతో, వేడి వాటర్‌తో కూడా గోడల్ని శుభ్రం చేయొచ్చు.

గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సంప్రదించగలరు.

Read Also..

Holi colours: హోలీ రోజు చల్లే రంగుల వెనుక అర్థం ఏంటో తెలుసా?

Next Story