- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్ట్రెస్ ఈటింగ్ కంట్రోల్ చేసుకోలేకపోతున్నారా? అయితే ఇలా ట్రై చేయండి!
నేటి ఆధునిక జీవన శైలిలో వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు ఏదో ఒక విషయంలో ఒత్తిడికి గురవుతున్నారు.

దిశ, వెబ్ డెస్క్: నేటి ఆధునిక జీవన శైలిలో వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు ఏదో ఒక విషయంలో ఒత్తిడికి గురవుతున్నారు. అయితే, స్ట్రెస్ మానసిక ఆరోగ్యాన్నే కాదు, శారీరక ఆరోగ్యాన్ని సైతం పాడుచేస్తుంది. ఒత్తిడికి గురైనప్పుడు శరీరంలో కార్టిసాల్ అనే హార్మోన్ విడుదల అవుతుంది. శరీరంలో కార్టిసాల్ లెవల్స్ పెరిగితే.. తీపి పదార్థాలు, జంక్ ఫుడ్ తినాలనిపిస్తుంది. దీనినే స్ట్రెస్ ఈటింగ్ అంటారు. ఇది దీర్షకాలం పాటు ఉంటే అనేక ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయని నిపుణులు చెబుతున్నారు.
సాధారణంగా ఒత్తిడి, ఆందోళనలో ఉన్నప్పుడు కుకీస్, చిప్స్ వంటి వాటిపైకి మనసు మళ్లుతుంది. అంతేకాదు, ఆ సమయంలో ఎంత తిన్నా కడుపు నిండదు. స్ట్రెస్ ఈటింగ్ కారణంగా అక్కర్లేని ఫ్యాట్స్ వల్ల బరువు పెరిగి ఊబకాయం సమస్య ఎదుర్కోవాల్సి వస్తుంది. కొవ్వు, చక్కెర, క్యాలరీలతో కూడిన ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల.. శరీరంలో కొవ్వు పేరుకుపోడవం వల్ల స్థూలకాయం వస్తుంది. దీని కారణంగా గుండె సమస్యలు, డయాబెటిస్, కీళ్ల సమస్యలు ఎదురవుతాయి.
అలాగే, రోజంతా పనిచేసి అలసిపోయాక సాయంత్రం వేళల్లో తీపి వస్తువులు, పిండి పదార్థాలను ఎక్కువగా తినాలనే కోరిక కలుగుతుంది. ఇది కూడా స్ట్రెస్ ఈటింగ్‌లో భాగమే. ఈ సమస్య తీవ్రం అయితే లివర్ వాపు, ఫైబ్రోసిస్, సిర్రోసిస్ వంటి సమస్యలు ఎదుర్కోవలసి ఉంటుంది. కేవలం ఒత్తిడి మాత్రమే కాదు, కార్టిసాల్ హార్మోన్ ఉత్పత్తిని కెఫీన్ మద్యం కూడా పెంచుతాయి.
అయితే, ఈ స్ట్రెస్ ఫుడ్ క్రేవింగ్స్ తగ్గించేందుకు ఫైబర్ అధికంగా ఉండే తృణ ధాన్యాలు, ఆకుకూరలు, అవకాడోలు, కొబ్బరిని ఆహారంలో భాగం చేసుకోవాలి. అలాగే, తీపి తినాలనిపించినప్పుడు ఆపిల్, ఖర్జూరం వంటివి తీసుకోవటం ఉత్తమం. పెరుగు తాజా కూరగాయలతో చేసిన సలాడ్స్ కూడా మంచి ఎంపిక. ఉడికించిన శనగలు, మొలకలు, డ్రైఫ్రూట్స్‌ని ఈవినింగ్ స్నాక్స్‌గా తీసుకోవచ్చు. వీటి వల్ల క్రేవింగ్స్ తగ్గటంతో పాటు షోషకాలూ అందుతాయి.
గమనిక: ఈ సమాచారం ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఇంటర్నెట్ నుంచి తీసుకొబడింది. దీనిని పరిగణలోనికి తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.
Read More..
Health tips: వేసవిలోనే దొరుకుతాయని ఈ పండ్లు అతిగా తింటున్నారా?






