Bigg Boss 8 : ఈ రోజు ప్రోమో బ్లాక్ బస్టర్... యష్మిపై నాగ్ ఫైర్ అవుతుంటే ఎంజాయ్ చేస్తున్న హేటర్స్...

by Sujitha Rachapalli |   ( Updated:2024-09-15 12:17:32.0  )
Bigg Boss 8 : ఈ రోజు ప్రోమో బ్లాక్ బస్టర్... యష్మిపై నాగ్ ఫైర్ అవుతుంటే ఎంజాయ్ చేస్తున్న హేటర్స్...
X

దిశ, ఫీచర్స్ : బిగ్ బాస్ 8 సీజన్ మొదటి ఎపిసోడ్ నుంచే వార్ స్టార్ట్ అయింది. దీంతో మీరు మీరు కొట్టుకుని మమ్మల్ని ఎంటర్తైన్ చేయండి అని రిలాక్స్ అవుతున్నారు ఆడియన్స్. ఇక ఇప్పటికే రెండు వారాలు కావస్తుండగా కంటెస్టెంట్స్ ఫ్యాన్స్ బేస్ స్టార్ట్ అయింది. ఈ క్రమంలో అభిమానులు ఏమో కానీ మొదటి ఇంటి సభ్యురాలు, ప్రస్తుతం ముగ్గురు చీఫ్స్ లో ఒకరైన యష్మికి మాత్రం హేటర్స్ ఎక్కువైపోయారు. ఓవర్ యాక్షన్ చేస్తుందని.. అన్నింట్లో వేలు పెట్టి నా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతా అంటుందని తిట్టిపోస్తున్నారు. లాస్ట్ సీజన్ లో మోనితను గుర్తు తెస్తుందని అంటున్నారు.

ఈ క్రమంలో ఈ రోజు శనివారం స్పెషల్ ప్రోమో రిలీజ్ అయింది. హోస్ట్ నాగార్జున చివాట్లు పెట్టేందుకు గన్ తో వచ్చేశాడు. ఫైర్ ఫైర్స్ ది ఫైర్ అంటూ తప్పులు ముక్కు సూటిగా చెప్పేశాడు. ఈ క్రమంలో అందరూ అనుకున్నట్లు యష్మిని గట్టిగానే వేసుకున్నాడు. ముఖ్యంగా మణికంఠ విషయంలో ఆమె చేసిన మిస్టేక్స్ ఎత్తి చూపిన నాగ్... సంచాలక్ గా మాత్రమే కాదు చీఫ్ గా కూడా ఫెయిల్ అయ్యావని చెప్పాడు. దీంతో ఆమె హేటర్స్ పండగ చేసుకుంటున్నారు. మాకు కావాల్సిందే ఇదే నాగ్ సార్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆమె కనుక నామినేషన్లలో ఉంటే కచ్చితంగా బయటకు పంపిస్తామని అంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed