మామిడి సీజన్ వచ్చిందని అతిగా తినేస్తున్నారా.. ఈ విషయాలు తెలుసుకోకపోతే డేంజరే?

by Disha Web Desk 7 |
మామిడి సీజన్ వచ్చిందని అతిగా తినేస్తున్నారా.. ఈ విషయాలు తెలుసుకోకపోతే డేంజరే?
X

దిశ, ఫీచర్స్: వేసవి వచ్చిదంటే మామిడి పండ్ల సీజన్ స్టార్ట్ అయినట్లే. ఎక్కడ చూసిన మామిడి పండ్లే కనిపిస్తాయి. ఇక మ్యాంగోస్‌ను ఇష్టపడని వాళ్లు ఉండరు కాబట్టి.. దొరికిందే చాన్స్ అనుకుని అదే పనిగా లాగించేస్తా ఉంటారు. అంతే కాకుండా.. మామిడి పండ్ల కారణంగా ఎన్నో ఆర్యోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయి. అందుకే సమ్మర్ స్టార్ట్ అయిందంటే అందరూ ఎక్కువగా మామిడి పండ్ల వైపు మొగ్గుచూపుతారు. అయితే మితంగా కాకుండా అధికంగా తిసుకుంటే మాత్రం ఇబ్బందులు తప్పవని చెబుతున్నారు నిపుణులు. ఎక్కువగా మామిడి పండ్లు తినడం వల్ల ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..

* మామిడి బాడీకి వేడి చేసే పదార్ధం. అందుకే మితంగా తీసుకోవాలి. అలా కాకుండా ఎక్కువగా తినిడం వల్ల.. శరీరానికి వేడి చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో మోషన్స్ అవ్వడం, చెమట పొక్కులు రావడం వంటివి జరుగుంది.

* ఇక మామిడి పండ్లు తినాలి అనుకునే వారు భోజనానికి అరగంట ముందు కానీ తర్వాత కానీ తినడం మంచిది. అలా కాకుండా భోజనం చేసిన వెంటనే లేదా భోజనం చేసే ముందు మ్యాంగోస్ తీసుకున్నట్లుయితే.. జీర్ణ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు నిపుణులు.

* అయితే.. సమ్మర్ వచ్చిందంటే బయట వేడికి, చెమటకు చాలా మంది స్కిన్‌కు సంబంధించిన అలర్జీలతో సతమతమవుతారు. అలాంటి వారు మామిడి పండ్లు ఎంత తక్కువ తింటే అంత మంచిదని తెలిపారు నిపుణులు. ఎందుకంటే స్కిన్ అలర్జీలతో బాధపడే వారు మామిడి పండ్లను అధికంగా తీసుకుంటే ఈ సమస్య మరింత ఎక్కువయ్యే చాన్స్ ఉందట. దాంతో పాటు చర్మంపై దురద ఎక్కువయ్యే అవకాశం కూడా ఉందని హెచ్చరిస్తున్నారు నిపుణులు.

* మామిడి పండ్లలో ఎక్కువగా ఫైబర్ ఉంటోంది. అందుకే ఇవి ఎక్కువగా తింటే.. జీర్ణ సంబంధిత సమస్యలు రావడంతో పాటు.. కడుపు ఉబ్బరంగా మారే అవకాశం కూడా ఉంటుందట.

* ఇక ఫైనల్‌గా మామిడి పండ్లలో ఫ్రక్టోజ్ ఎక్కువగా ఉండటం వల్ల.. అధికంగా తింటే శరీరంలో అసమతుల్యతను సృష్టిస్తుందని చెబుతున్నారు నిపుణులు.

నోట్: పైన ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్, కొందరు వైద్య నిపుణుల సలహాల మేరకు ఇచ్చినవి మాత్రమే.

Next Story

Most Viewed