- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పేస్‌మేకర్ ఉన్నప్పుడు ఎంఆర్ఐ చేయొచ్చా?
ఎంఆర్ఐ చేస్తుండగా మహిళ మృతిచెందిన విషాద ఘటన నిర్లక్ష్యానికి ప్రతీక. రోగి శరీరంలో ఏవైనా లోహపు వస్తువులు ఉన్నట్లయితే ఎంఆర్‌ఐకి ముందు వాటిని తొలగించాలి. కనీస జాగ్రత్తలు పాటించాలి. కానీ ఇవేవి అడగకుండానే పేషెంట్‌కు ఎంఆర్ఐ చేశారు. ముఖ్యంగా హార్ట్‌లో పేస్‌మేకర్ అమర్చిన ఈ పేషెంట్ ఎంఆర్ఐ సమయంలో

దిశ, ఫీచర్స్ : ఎంఆర్ఐ చేస్తుండగా మహిళ మృతిచెందిన విషాద ఘటన నిర్లక్ష్యానికి ప్రతీక. రోగి శరీరంలో ఏవైనా లోహపు వస్తువులు ఉన్నట్లయితే ఎంఆర్‌ఐకి ముందు వాటిని తొలగించాలి. కనీస జాగ్రత్తలు పాటించాలి. కానీ ఇవేవి అడగకుండానే పేషెంట్‌కు ఎంఆర్ఐ చేశారు. ముఖ్యంగా హార్ట్‌లో పేస్‌మేకర్ అమర్చిన ఈ పేషెంట్ ఎంఆర్ఐ సమయంలో గిలగిల కొట్టుకుంటున్నా.. పర్లేదు అలాగే జరుగుతుందని లైట్ తీసుకున్నారట. దీంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. ఇంతకీ పేస్‌మేకర్ అంటే ఏంటి? బాడీలో పేస్‌మేకర్ ఉంటే ఎంఆర్ఐ చేయొచ్చా?
ఇంప్లాంటబుల్ పేస్‌మేకర్లు గుండె రోగులకు ప్రాణాధారంగా ఉంటాయి. ఈ పరికరాలు గుండె రేటును నియంత్రించడంలో సహాయపడతాయి. తాజా పేస్‌మేకర్‌లు చిన్న పరిమాణంలో ఉంటాయి. దీర్ఘకాలిక బ్యాటరీ లైఫ్ కలిగి ఉంటాయి. అధునాతన ఫీచర్లను అందిస్తాయి. MRI అనేది శరీరంలోని లోపలి భాగాలను పరిశీలించడానికి ఉపయోగించే శక్తివంతమైన ఇమేజింగ్ టెక్నిక్. పేస్‌మేకర్ ఉన్న రోగులకు MRI చేయడం సవాలుగా ఉంటుంది. ఎందుకంటే పేస్‌మేకర్‌లోని లోహ భాగాలు MRI మాగ్నెటిక్ ఫీల్డ్‌తో ప్రభావితమవుతాయి. అయితే తాజా పేస్‌మేకర్‌లు MRI అనుకూలంగా రూపొందించబడ్డాయి. అయినా సరే ఈ రోగులు కార్డియాలజిస్టు పర్యవేక్షణలో ఎంఆర్ఐ చేయించుకోవాలి.
MRI అనుకూల పేస్‌మేకర్‌లు ప్రత్యేకమైన డిజైన్, పదార్థాలతో తయారు చేయబడతాయి. MRI మాగ్నెటిక్ ఫీల్డ్‌లను తట్టుకోగలవు. కాకపోతే ఖరీదు ఎక్కువ. అయితే ఎంఆర్ఐ చేయించే ముందు వైద్యులు ఈ పరికరాన్ని ఎంఆర్ఐ మోడ్‌లో సెట్ చేయాల్సి ఉంటుంది. దీనివల్ల స్కాన్ సమయంలో సమస్యలు రాకుండా ఉంటాయి. 3 టెస్లా MRI స్కానర్లు సాధారణంగా 1.5 టెస్లా స్కానర్ల కంటే ఎక్కువ శక్తివంతంగా ఉంటాయి. కాబట్టి వీటిని నివారించడం మంచిది. MRI సమయంలో పేస్‌మేకర్ వంటి ఇంప్లాంట్‌లు కొంతమేరకు వేడి కావచ్చు. ఇది పరికరాల పనితీరును ప్రభావితం చేయవచ్చు. అందుకే, MRI చేయించే ముందు, తర్వాత పేస్‌మేకర్‌ను పరీక్షించడం ముఖ్యం. సరైన పేస్‌మేకర్ ఎంపిక, MRI అనుకూలత గురించి మీ కార్డియాలజిస్ట్‌తో చర్చించడం ముఖ్యం. మీ ఆరోగ్య పరిస్థితి, అవసరాలు, భవిష్యత్తులో అవసరమైన పరీక్షలను దృష్టిలో ఉంచుకుని ఉత్తమమైన పేస్‌మేకర్‌ను సిఫార్సు చేస్తారు.






