Viral Video: చేతులు లేవు..కాళ్లూ లేవు.. అయినా పోరాటం ఆగలేదు.. ఈ వీడియో చూస్తే గూస్‌బంప్స్‌ గ్యారెంటీ!

by Vennela |
Viral Video: చేతులు లేవు..కాళ్లూ లేవు.. అయినా పోరాటం ఆగలేదు.. ఈ వీడియో చూస్తే గూస్‌బంప్స్‌ గ్యారెంటీ!
X

దిశ, వెబ్ డెస్క్: Viral Video: ఒక వ్యక్తి ధైర్యం, ఆత్మవిశ్వాసం ఉంటే ఎలాంటి పరిస్థితులనైనా సులభంగా ఎదుర్కొంటాడు. కుంగిపోకుండా పరిస్థితిని ఎదురురించి ముందు అడుగు వేస్తారు. కాళ్లు, చేతులు కోల్పోయిన ఎంతో మంది తమ నోటితో పెయింటింగ్ వేస్తున్న వీడియోలు ఎన్నో చూశాం. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో ఓ వ్యక్తి ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా నిలిచింది.

వలస పిట్ట అనే ట్విట్టర్ అకౌంట్లో లో ఆ వీడియో షేర్ అయ్యింది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ వ్యక్తికి కాళ్లూ, చేతులు లేవు. అయినా తన జీవనం కోసం ఓ నాలుగు టైర్ల రిక్షాపై సరుకులు అమ్ముతున్నాడు. పుట్టుకతోనే ఆ వ్యక్తి కాళ్లు చేతులు లేవు. అయినా కూడా తన జీవన పోరాటం ఏమాత్రం ఆపడంలేదు. ప్రత్యేకంగా రూపొందించిన చక్రాల బండిలో సరుకులను అమ్ముతూ జీవనం వెళ్లదీస్తున్నాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ వీడియో 127.3K వ్యూస్ దక్కించుకుంది. ఈ స్పూర్థిదాయక వీడియోకు నెటిజన్లు ఎమోషన్ కామెంట్స్ చేస్తున్నారు. చేతులు, కాళ్లు కాదు ఆత్మవిశ్వాసం ముఖ్యం..ఈ వీడియోలోని వ్యక్తి ఎంతో మందికి స్పూర్తి..అతని ప్రయాణం ఎప్పటికీ ఆగదు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.





Next Story

Most Viewed