Technology : AI ఎందుకు అవసరం..? ఆ Skills ఎందుకు నేర్చుకోవాలి?

by Javid Pasha |

Technology : AI ఎందుకు అవసరం..? ఆ Skills ఎందుకు నేర్చుకోవాలి?
X

దిశ, ఫీచర్స్ : ఇప్పుడందరూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (A.I) గురించే మాట్లాడుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికల్లో సైతం ఏఐ బేసిస్ యాప్స్‌కు, టూల్స్‌కు సంబంధించిన ప్రమోషన్లే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కొన్ని ఆర్గనైజేషన్లనైతే ఏఐ వర్క్‌షాప్‌లు నిర్వహిస్తుండగా, మరికొన్ని సంస్థలు ఆన్‌లైన్‌లో, ఆఫ్‌లైన్‌లో ఏఐ స్కిల్స్ ట్రైనింగ్స్ నిర్వహిస్తున్నాయి. ఇక సాఫ్ట్‌వేర్ కంపెనీలు సహా అధిక ఆదాయం గల రిక్రూటర్లు ఏఐ స్కిల్స్ ఉన్నవారికి, లేదా కనీస పరిజ్ఞానం కలిగిన వారికే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తు్న్నారు. అందుకే ఆధునిక యువత ఏఐ స్కిల్స్‌పై ఫోకస్ చేయాలని సాంకేతిక నిపుణులు సూచిస్తున్నారు. అయితే దానివల్ల యువతకు ప్రయోజనాలేమిటి? నిత్య జీవితంలో ఈ సాంకేతికత ఏ విధంగా ఉపయోగపడుతుందో ఇప్పుడు చర్చిద్దాం.

ఏఐ స్కిల్స్ ఎందుకు నేర్చుకోవాలి?

* కెరీర్ అవకాశాలు : ప్రపంచమంతా అంగీకరిస్తున్న విషయం ఏంటంటే.. భవిష్యత్‌లో ఏఐ ఆధారిత కెరీర్ అవకాశాలు పెరుగుతాయి. సాంకేతిక నిపుణులు అదే చెబుతున్నారు. అంటే ఈ స్కిల్స్‌ ఉన్నవారికే జాబ్స్ దొరికే చాన్సెస్ ఎక్కువ. కాబట్టి ఏఐ నైపుణ్యాలకు మరింత డిమాండ్ పెరుగుతుంది. ఉదాహరణకు LinkedIn ఉద్యోగ డేటా ప్రకారం.. డేటా సైంటిస్ట్ ఉద్యోగాలకు అధిక డిమాండ్ పెరగనుంది. అలాగే ఏఐ ఇంజనీర్‌లకు గూగుల్, అమెజాన్ వంటి సంస్థల్లో అధిక వేతనాలతో కూడిన ఉద్యోగాలు వస్తున్నాయి. ఇది అనేక రంగాలకు విస్తరిస్తుంది. ఫ్రీలాన్స్ ప్లాట్‌ఫారమ్‌లలో (Upwork) ప్రస్తుతం ఏఐ ప్రాజెక్టులకు డిమాండ్ పెరుగుతోంది. అందుకని ఏఐ స్కిల్స్ నేర్చుకోవాలంటున్నారు నిపుణులు.

*భవిష్యత్ సాంకేతికత (Future technology) : ప్రస్తుతం ఏఐ హవా నడుస్తోంది. 2050 నాటికి ఇది ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక డిమాండ్ కలిగిన సాంకేతికతగా మారుతుంది. అంటే భవిష్యత్‌ను డామినేట్ చేయగల టెక్నాలజీ ఇదే. ఉదాహరణకు ఆటోమేషన్ కార్లు (Tesla Autopilot) ఏఐ ఆధారంగా పనిచేస్తాయి. గూగుల్ డీప్‌మైండ్, అల్ఫా ఫోల్డ్ వంటి ఏఐ బేస్డ్ (AI-based) వైద్య పరికరాలు (medical devices)కు డిమాండ్ పెరుగుతుంది. స్మార్ట్ సిటీస్‌లో ట్రాఫిక్, ఎనర్జీ మేనేజ్‌మెంట్ వంటి విషయాల్లో ఏఐ కీ రోల్ పోషించనుంది.

*ప్రాబ్లమ్ సాల్వింగ్ (Problem solving) : మనుషులు ఛేదించలేని అనేక సంక్లిష్ట సమస్యలను ఏఐ పరిష్కరిస్తుంది. ఉదాహరణకు DeepMind కు చెందిన AlphaGo గేమ్‌లో మానవ క్రీడాకారులను(Human players) ఓడించింది. అంతేకాకుండా ఏఐ ద్వారా వాతావరణ మార్పుల అంచనా సాధ్యమవుతుంది. ప్రస్తుతం నాసా డేటా విశ్లేషణలో ఏఐ సహాయపడుతోంది. అలాగే సైబర్ దాడులను గుర్తించడం, నివారించడంలో కూడా ఏఐ సాంకేతికత సమర్థవంతంగా పనిచేస్తున్నది.

ఏఐ వల్ల ప్రయోజనాలు ఏమిటి?

* సామర్థ్యం : ఏఐ టెక్నాలజీతో అనేక పనులను మరింత వేగంగా, సమర్థవంతంగా చేసే అవకాశం ఉంటుంది. పైగా ఇది సమాచారాన్ని సులభంగా, కచ్చితంగా అందించడంలో కీ రోల్ పోషిస్తుంది. ఉదాహరణకు గూగుల్ మ్యాప్స్ ఏఐ ద్వారా ట్రాఫిక్ డేటాను విశ్లేషించి, యూజర్లకు వేగవంతమైన, అనువైన మార్గాలను సూచిస్తుంది. అలాగే అమెజాన్ వంటి వేర్ హౌస్‌లలో ఏఐ రోబోట్స్ ఆర్డర్లను స్కాన్ చేసి, ప్యాకింగ్‌ను స్పీడప్ చేయడంలో సహాయపడుతున్నాయి. ఇక ఏఐ ఆధారిత షెడ్యూలింగ్ టూల్స్ (ఉదా., Calendly) మీటింగ్‌లను పైతం ఆటోమేటికల్లీ హ్యాండిల్ చేస్తాయి. నిర్వహిస్తాయి కూడా.

*ఆటోమేషన్: తరచుగా పునరావృమయ్యే పనులను ఆటోమేట్ చేయడం ద్వారా ఏఐ టెక్నాలజీ ప్రొడక్టివిటీని పెంచుతుంది. ఉదాహరణకు బ్యాంకింగ్ రంగంలో ఏఐ చాట్‌బాట్‌లు (ఉదా., Bank of America కు చెందిన Erica) కస్టమర్ల సందేహాలకు 24/7 ఆన్సర్లు ఇస్తుంటాయి. ఏఐ ఆధారిత సాఫ్ట్‌వేర్ (ఉదా., UiPath) డేటా ఎంట్రీ, ఇన్‌వాయిస్ ప్రాసెసింగ్‌ను ఆటోమేట్ చేస్తుంది. అంతేకాకుండా ఏఐ ఈమెయిల్ ఫిల్టరింగ్ (Gmail) స్పామ్‌ను ఆటోమేటిగ్గా గుర్తిస్తుంది.

* డేటా ఎనలైజింగ్ : ఒకటి రెండు పేరాల్లో ఉన్న డేటాను ఒకేసారి చదవడం, విశ్లేషించడం మనుషులకు చాలా సులభం. కానీ వంద, రెండు వందలు, వెయ్యి పేజీలు చదివి విశ్లేషించగలరా ఎవరైనా? అప్పటికప్పుడు అస్సలు చేయలేరు. అలా చేయడానికి చాలా సమయం పడుతుంది. కానీ ఏఐ టూల్స్ వినియోగిస్తే.. 10 నిమిషాల్లోనో, అరగంటలోనో ఆ పని అయిపోతుంది. మొత్తం చదివివేసి కావాల్సినంత సమాచారాన్ని ఏఐ అందించడమే కాకుండా, మొత్తం సమాచారం మీకు ఎంత కావాలంటే, అంత పరిమాణంలోనే అందించగలదు. ఎంత అద్భుతం కదా? ఉదాహరణకు IBM Watson క్యాన్సర్ రోగుల డేటాను విశ్లేషించి, ఎలాంటి ట్రీట్మెంట్ అవసరమో సూచనలు అందిస్తుంది. డాక్టర్లకు ఇదెంతో మేలు చేస్తుంది. ఇక గూగుల్ అనలిటిక్స్ వెబ్‌సైట్ ట్రాఫిక్‌ను విశ్లేషించి, మార్కెటింగ్ వ్యూహాలను సైతం మెరుగుపరుస్తుంది. Salesforce‌లో ఏఐ కస్టమర్ డేటాను విశ్లేషించి, సేల్స్ ఫనల్‌ను ఆప్టిమైజ్ చేస్తుంది.

ఏయే రంగాల్లో, ఏ విధంగా ఉపయోగపడుతుంది

* వైద్య రంగం : ఏఐ ఆధారంగా రోగ నిర్ధారణ, విశ్లేషణ వేగంగా, సమర్థవంతంగా సాధ్యం అవుతుంది. ఉదాహరణకు Google Health‌కు సంబంధించిన DeepMind రెటినల్ స్కాన్‌ల ద్వారా కంటి వ్యాధులను గుర్తిస్తుంది. అలాగే IBM Watson Oncology క్యాన్సర్ చికిత్సలను సూచిస్తుంది. PathAI బయాప్సీ శాంపిల్స్‌ను విశ్లేషించి రోగ నిర్ధారణ చేస్తుంది.

* వ్యాపార రంగం : Zendesk‌కు సంబంధించిన ఏఐ చాట్‌బాట్‌లు కస్టమర్ సపోర్ట్‌ను మెరుగుపరుస్తాయి. ఉదాహరణకు HubSpot ఏఐ మార్కెటింగ్ క్యాంపెయిన్‌లను ఆప్టిమైజ్ చేస్తుంది. Tableau ఏఐ ద్వారా బిజినెస్ డేటా విజువలైజేషన్ సాధ్యం అవుతుంది.

* రవాణా రంగం : రవాణా రంగంలో ఏఐ ఆధారంగా సేవలు సులభతరం అవుతాయి. ఉదాహరణకు Waymoకు సంబంధించిన ఆటోమేషన్ కార్లు ఏఐ ద్వారా రోడ్డు భద్రతను పెంచుతాయి. Uber ఏఐ రైడ్ షేరింగ్ ఆప్టిమైజేషన్‌ సమర్థవంతంగా పనిచేస్తోంది.

జర్నలిజం ఫీల్డ్‌లో..

*కంటెంట్ రైటింగ్, క్రియేటింగ్ : ఇండియాలో అంతగా వినియోగించడం లేదు కానీ, ఇప్పటికే ఏఐ ఆధారిత టూల్స్ ఆటోమేటెడ్ కంటెంట్ రచనలో ఎఫెక్టివ్‌గా పనిచేస్తున్నాయి. ఉదాహరణకు The Washington Post కు సంబంధించి Heliograf క్రీడా నివేదికలను ఆటోమేట్ చేస్తుంది. Associated Press ఏఐ ద్వారా ఆర్థిక నివేదికలను రాస్తుంది. Narrative Scienceకు సంబంధించిన Quill డేటా నుంచి స్టోరీలను క్రియేట్ చేస్తుంది.

*డేటా జర్నలిజం : మరో 20, 30 ఏండ్ల తర్వాత ఏఐ జర్నలిజం రాజ్యమేలనుందని సాంకేతిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే అమెరికన్ లాభాపేక్షలేని సంస్థ ProPublica ఏఐ ద్వారా అక్కడి ప్రభుత్వ డేటాను విశ్లేషించి ఇన్వెస్టిగేటివ్ స్టోరీస్ రాస్తున్నది. The Guardian డేటా సెట్‌లను విశ్లేషించి పొలిటికల్ స్టోరీలు రాస్తున్నది. Reuters ఏఐ టూల్స్ ద్వారా ఆర్థిక డేటా నివేదికలను రూపొందిస్తున్నది.

*ఫాక్ట్-చెకింగ్: Full Fact ఏఐ టూల్స్ ద్వారా సోషల్ మీడియా తప్పుడు సమాచారాన్ని గుర్తిస్తుంది. PolitiFact ఏఐ ద్వారా రాజకీయ ప్రకటనలను ధృవీకరిస్తుంది. Snopes ఏఐ ఆధారిత ఫాక్ట్-చెకింగ్ టూల్స్ సమాచార విశ్లేషణలో సహాయపడతాయి.

ఏఐ స్కిల్స్ ఎందుకు, ఎవరికి ముఖ్యం?

* ఉద్యోగ అవకాశాలు : ఏఐ ఆధారిత స్కిల్స్ ఉన్నవారికి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. ఇప్పటికే మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్‌లకు Microsoft, Googleలో వంటి సంస్థల్లో డిమాండ్ పెరుగుతోంది. ఉదాహరణకు డేటా అనలిస్ట్ రోల్స్ (Walmart, Amazon). అలాగే ఏఐ ఆధారిత స్టార్టప్‌లలో (OpenAI, Anthropic) అవకాశాలు పెరుగుతాయి. అంతేకాకుండా విద్యార్థులు, యువత ఏఐ ఆధారిత స్కిల్స్ కలిగి ఉంటే భవిష్యత్తు ఉద్యోగాలకు ప్లస్ పాయింట్ అవుతుంది. ఏఐ ప్రాజెక్టుల ద్వారా ఇంటర్న్‌షిప్ అవకాశాలు అందిపుచ్చుకోవచ్చు.

*ప్రొఫెషనల్స్‌కు : జర్నలిస్టులు ఏఐ టూల్స్ (Grammarly, Quill) ఉపయోగించుకొని మెరుగైన సమాచారాన్ని పొందడం, అందించడం, అభివృద్ధి చేయడం చేయవచ్చు. హెల్త్‌కేర్ ప్రొఫెషనల్స్ మెరుగైన వైద్యం అందించడంలో ఏఐ డయాగ్నోస్టిక్ టూల్స్ ద్వారా ఎఫెక్టివ్‌గా ఉపయోగపడతాయి. మార్కెట్లు కూడా ఏఐ ఆధారిత అనలిటిక్స్ (Google Ads)ను ఉపయోగిస్తాయి.

Next Story