- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అఘోరీ దెబ్బకు ఇంకెన్ని దారుణాలు చూడాల్సి వస్తుందో.. పిల్లలురా మీరు.. ఆ తాళి ఎక్కడ దొరికిందిరా బాబు?
తెలుగు రాష్ట్రాల్లో అఘోరీ చేసిన హల్ చల్ అంతా ఇంతా కాదు.. ముందుగా ఇంట్లో బంధించుకుని సజీవదహనం చేసుకుంటా అని పోలీసులను పరుగెత్తించాడు.. ఇలా నెల రోజులపాటు రచ్చ రచ్చ చేశాడు.. హౌజ్ అరెస్ట్‌లు, కాపలాలు.. అబ్బో

దిశ, ఫీచర్స్ : తెలుగు రాష్ట్రాల్లో అఘోరీ చేసిన హల్ చల్ అంతా ఇంతా కాదు.. ముందుగా ఇంట్లో బంధించుకుని సజీవదహనం చేసుకుంటా అని పోలీసులను పరుగెత్తించాడు.. ఇలా నెల రోజులపాటు రచ్చ రచ్చ చేశాడు.. హౌజ్ అరెస్ట్‌లు, కాపలాలు.. అబ్బో అంత ఇంత రచ్చ కాదు.. ఇక ఆ తర్వాత ఓ అమ్మాయిని తీసుకుపోయి ప్రేమ అన్నడు.. చివరకు పెళ్లి చేసుకున్నాడు.. ఒక్కసారి కాదు ఏకంగా మూడుసార్లు.. ఇది జరిగిన తర్వాత అఘోరీకి నేను మొదటి భార్యను అంటూ మరో మహిళ బయటకు వచ్చింది.. ఇది హెడ్ లైన్స్‌కు ఎక్కి వైరల్ అవుతున్న సమయంలోనే.. మమ్మల్ని మోసం చేసిందంటూ మరో ఫ్యామిలీ అఘోరిపై కేసు పెట్టింది.. ఇంత స్టోరీ జరిగింది.. కానీ అఘోరీ స్త్రీనా లేక పురుషుడా అనే సందిగ్ధంలో టెస్టులు చేయాల్సి వచ్చింది. ఇది అఘోరీ స్టోరీ.
అయితే ఈ స్టోరీ బాగా ఎక్కించుకున్న కంటెంట్ క్రియేటర్స్.. దీన్నే కంటెంట్‌గా వదిలేస్తున్నారు. పిల్లలకు అఘోరీ గెటప్ వేసి వీడియోలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ వీడియో వైరల్ అవుతోంది. ఇందులో ఇద్దరు పిల్లల్లో ఒకరు అఘోరీ గెటప్‌లో ఉండగా.. ఇంకొకరు తాళి బొట్టు వేసుకుని సిగ్గుపడుతూ కనిపించారు. ఇక క్లిపింగ్ చూస్తున్న జనాలు.. అఘోరీ దెబ్బకు ఇంకెన్ని దారుణాలు చూడాల్సి వస్తుందోనని కామెంట్ చేస్తున్నారు. పిల్లలతో ఇలాంటి వీడియోలు చేయించొద్దని సూచిస్తున్నారు.






