- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఈ డ్రగ్ తీసుకుంటే శరీరం అంతా కురుపులు.. హెచ్చరిస్తున్న యూఎస్
జిలాజైన్(Xylazine) అనేది హెరాయిన్, ఫెంటానిల్ కలయికగా ఉన్న డ్రగ్.

దిశ, ఫీచర్స్: జిలాజైన్(Xylazine) అనేది హెరాయిన్, ఫెంటానిల్ కలయికగా ఉన్న డ్రగ్. దీన్నే ‘ట్రాంక్’ లేదా ‘ట్రాంక్ డోప్’ అని కూడా పిలుస్తారు. నొప్పి నుంచి ఉపశమనం, కండరాల సడలింపు కోసం పెద్ద జంతువులపై ఉపయోగించే ఈ మత్తుమందును.. ఏ మోతాదులోనూ మానవులు వినియోగించకూడదనే హెచ్చరికలున్నాయి. ఒక వ్యక్తి శరీరంలోకి దీన్ని ఇంజెక్ట్ చేసినప్పుడు.. నెమ్మదిగా హృదయ స్పందన రేటు తగ్గి, పూతలు, కురుపులతో కూడిన పెద్ద చర్మ గాయాలకు కారణమవుతుంది. తర్వాత చేతులు, కాళ్లపై వ్యాపించి చర్మం కుళ్లిపోయేలా చేస్తుంది. కాబట్టి జిలాజైన్‌ను ‘జోంబీ’ డ్రగ్ అని కూడా పిలుస్తుంటారు.
అక్రమ మాదకద్రవ్యాల మార్కెట్లో జిలాజైన్ వాడకం 2000ల ప్రారంభంలో ప్యూర్టో రికోలో మొదటిసారిగా కనుగొనబడింది. ప్రస్తుతం USలో అభివృద్ధి చెందుతున్న ముప్పుగా పరిగణించబడుతున్న ఈ ఔషధం .. దేశంలోని మొత్తం అధిక మోతాదు మరణాలలో 7 శాతంగా ఉంది. ఉత్తర అమెరికా చట్టవిరుద్ధమైన మాదకద్రవ్యాల మార్కెట్‌లో ఈ డ్రగ్ వ్యాప్తి యూఎస్‌ను ఆందోళనకు గురిచేస్తుండగా.. ఆప్ఘనిస్తాన్ ద్వారా యూరప్‌కు కూడా చేరినట్లు తెలుస్తోంది.
Also Read..
దాని సైజ్ 4 సెం.మీ. ఉంటే ట్యూబెక్టమీ చేయించుకున్నా పిల్లలు పుడతారా..? వైద్యులు ఏం చెబుతున్నారంటే..?






