- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
ఇది అమ్మ చేసిన పరోటా కాదు.. మదర్‌బోర్డ్ పరోటా..
దిశ, ఫీచర్స్ : సోషల్ మీడియా ప్రపంచం చాలా ప్రత్యేకమైనది. సోషల్ మీడియాలో ప్రతిరోజూ రకరకాల వీడియోలు వైరల్ అవుతూనే ఉంటాయి. సోషల్ మీడియాలో వచ్చే కొన్ని వీడియోలను చూసి చాలాసార్లు నవ్వుకుంటూ ఉంటాం. అలాగే కొన్ని విషయాలను కూడా నేర్చుకుంటాం. ఇప్పుడు ఇలాంటి ఒక వీడియోనే నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ అది ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇక మన దేశంలో ప్రతిభావంతులకు కొదవ లేదు. వారి వారి తెలివి తేటలతో ఎన్నో కొత్త కొత్త విషయాలను కనిపెడుతూ ఉంటారు. అయితే వారి ప్రతిభను చూసి ఆశ్చర్యపోక తప్పదు మరి. ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోలో ఓ ప్రతిభావంతుడు తవాలో కాకుండా CPUలో ఆలూ పరోటాను తయారు చేస్తున్నారు. ఈ క్లిప్ ను చూశాక ఆ మనిషిలో ఇంత అద్భుతమైన టాలెంట్ ఉందా అని అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు.
వీడియోలో ఆ వ్యక్తి ఆలూ పరోటా చేయడానికి చిన్న పిండి ముద్దలను తయారు చేసి అందులో బంగాళాదుంపలను నింపి చిన్న పరోటాని. దాని తరువాత అతను దానిని మదర్ బోర్డ్‌లో పెట్టాడు. కొద్ది సేపటికి ఆ పరోటా వేడెక్కింది. దీని తరువాత సిరంజిని ఉపయోగించి పరోటా పై కొద్దిగా నూనె పోశాడు. దానిని మళ్లీ తిప్పి మెల్లిగా కాల్చి పరోటాని తయారు చేశాడు. ఈ క్లిప్ @lets_tech_official అనే ఖాతా ద్వారా Instaలో పోస్ట్ చేశాడు.