పూల వ్యర్థాలతో రూ.50 కోట్ల సామ్రాజ్యం.. గంగా కాలుష్యానికి పరిష్కారం!

by Javid Pasha |

ఒక్క సృజనాత్మక ఆలోచన వ్యర్థాన్ని సైతం ధనంగా, పర్యావరణ హితంగా ఎలా మార్చగలదో అతని సక్సెస్ జర్నీ నిరూపించింది

పూల వ్యర్థాలతో రూ.50 కోట్ల సామ్రాజ్యం.. గంగా కాలుష్యానికి పరిష్కారం!
X

దిశ, ఫీచర్స్ : అది నిరంతరం జన సంచారంతో అలరారే పవిత్ర గంగానది ప్రాంతం. భక్తులు తెచ్చిన పూలను ఆలయాల్లో పూజ చేసి, వాటిని నదిలో పారేస్తుంటారు. దీని వల్ల నది కాలుష్యం పెరుగుతోందని గమనించిన ఓ యువకుడు దానికి సృజనాత్మక పరిష్కారం కనుగొన్నాడు. ఇంతకీ అతనెవరు? ఏం చేశాడు?

పేరు అంకిత్ అగర్వాల్. 2017లో IIT కాన్పూర్ సహాయంతో Phool.co అనే స్టార్టప్‌ను స్థాపించాడు. అప్పటి నుంచి గంగానది ఒడ్డున ఆలయాల్లో, పరిసరాల్లో పూల వ్యర్థాలను సేకరించి ‘ఫ్లవర్ సైక్లింగ్’ టెక్నాలజీ ద్వారా ఎకో-ఫ్రెండ్లీ ఉత్పత్తులుగా మారుస్తున్నాడు. అంటే అగర్ బత్తీలు, పూజా సామగ్రిలో ఉపయోగించే ధూప కర్రలను తయారు చేస్తున్నాడు. ఇప్పుడు ఈ కంపెనీ సుమారు ₹50 కోట్ల విలువైన వ్యాపార సామ్రాజ్యంగా అభివృద్ధి చెందింది.

Phool.co ఇప్పుడు అగర్‌బత్తీలతోపాటు ఇతర సస్టైనబుల్ బయో-లెదర్ ఉత్పత్తులను సైతం తయారు చేస్తోంది. గ్రామీణ మహిళలకు ఉపాధి కల్పిస్తూ, దాదాపు 90 దేశాలకు ఎగుమతి చేస్తోంది. బాలీవుడ్ నటి ఆలియా భట్ కూడా ఈ స్టార్టప్‌లో పెట్టుబడి పెట్టారు. మొత్తానికి ఈ సక్సెస్ జర్నీ నేటి యువతకు ఒక ప్రేరణగా నిలుస్తుందని పలువురు పేర్కొంటున్నారు. ఒక్క సృజనాత్మక ఆలోచన వ్యర్థాన్ని సైతం ధనంగా, పర్యావరణ హితంగా ఎలా మార్చిందో Phool.co ప్రయాణం చక్కగా చూపిస్తోంది.

Next Story