‘అది పియానో వాయించడాన్ని గుర్తు చేసింది’.. వైరల్ అవుతున్న ఓ వ్యక్తి స్పీడ్ టైపింగ్ వీడియో

by Disha Web Desk 10 |
‘అది పియానో వాయించడాన్ని గుర్తు చేసింది’.. వైరల్ అవుతున్న ఓ వ్యక్తి స్పీడ్ టైపింగ్ వీడియో
X

దిశ, ఫీచర్స్: మీరు సోషల్ మీడియాను రెగ్యులర్‌గా ఫాలో అవుతుంటారా? అయితే అత్యంత వేగంగా కంప్యూటర్ కీబోర్డుపై టైప్ చేస్తున్న ఓ వ్యక్తికి సంబంధించిన వైరల్ వీడియోను మీరు కూడా చూడవచ్చు. అదెక్కడో కరెక్టు తెలీదు కానీ ఇండియాలోని ఓ ఫార్మసీ రిసెప్షన్‌లో అని దాని కింద క్యాప్షన్‌‌ను బట్టి తెలుస్తోంది. ఇందులో సదరు వ్యక్తి బిల్లులు చేసే సమయంలో నమ్మశక్యం కాని విధంగా యమ స్పీడుగా టైప్ చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అది చూసిన ప్రతీ ఒక్కరు కామెంట్ చేస్తున్నారు. ఈ పోస్టు ఈరోజే కొన్ని గంటల క్రితం ట్విట్టర్‌లో షేర్ చేయబడింది. అప్పటి నుంచి వీడియోకు 4.6 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. 18,000 లైక్‌లతోపాటు అత్యధికంగా షేరింగ్‌ను కలిగి ఉంది. ఒక యూజర్ స్పందిస్తూ ‘వావ్ అతని టైపింగ్ పియానో వాయించడాన్ని గుర్తు చేస్తోంది’ అని కామెంట్ చేశాడు. మరో వ్యక్తి తాను కూడా అలా రికార్డు బ్రేక్ చేసేందుకు ట్రై చేస్తానంటూ పేర్కొన్నాడు. ఇలాంటివి కొందరికే సాధ్యమంటూ మరికొందరు స్పందించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా ట్రెండింగ్‌లో ఉంది.

ఇవి కూడా చదవండి: 3 గంటల్లో క్యాన్సర్‌ను గుర్తించవచ్చు.. కొత్త టెక్నిక్‌ను కనుగొన్న స్పానిష్ సైంటిస్టులు


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed