అలవాటుగా కాదు.. టెక్నాలజీని ఈ విధంగా వాడితే బోలెడు బెనిఫిట్స్!

by Javid Pasha |

టెక్నాలజీని పర్పస్ కోసం వాడితే..సెల్ఫ్ కంట్రోలింగ్‌ను పెంచి, మానసిక ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది.

అలవాటుగా కాదు.. టెక్నాలజీని ఈ విధంగా వాడితే బోలెడు బెనిఫిట్స్!
X

దిశ, ఫీచర్స్ : టెక్నాలజీని పరిమితికి మించి వాడటం వల్ల, దుర్వినియోగం చేయడంవల్ల అనేక నష్టాలున్నాయి. కానీ ఉద్దేశ పూర్వకంగా, ఒక పర్పస్ కోసం వాడటంవల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయని మీకు తెలుసా? ఇటీవల ‘సైంటిఫిక్ రిపోర్ట్స్’లో పబ్లిషైన ఒక అధ్యయనం సైతం ఇదే చెబుతోంది. డిజిటల్ యుగంలో సాంకేతికతను ఒక అలవాటుగా కాకుండా లక్ష్యం కోసం వాడటమనేది మన దృష్టి నియంత్రణ, మానసిక శ్రేయస్సుపై సానుకూల ప్రభావం చూపుతుందని పేర్కొన్నది. అయితే దీనివల్ల కలిగే బెనిఫిట్స్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

అధ్యయనంలో భాగంగా టెక్నాలజీ వాడకం ఏ విధమైన ప్రభావం చూపుతుందో తెలుసుకోవడానికి 842 మంది వయోజనులను నిపుణులు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు సోషల్ మీడియా, వినోదం, సమాచారం వెతకడం, కమ్యూకేషన్ వంటి డిజిటల్ రంగాల్లో ఉద్దేశ పూర్వక వాడకం దృష్టి నియంత్రణను 0.42 బీటా వాల్యూతో మెరుగు పరుస్తుందని, మానసిక శ్రేయస్సును కూడా 0.37 వాల్యూతో పెంచుతుందని గుర్తించారు. అలాగే అలవాటుగా పాసివ్‌గా వాడటం దృష్టి & శ్రేయస్సు రెండింటినీ ప్రతికూలంగా (β = -0.39 & -0.31) ప్రభావితం చేస్తుందని కనుగొన్నారు. ఈ సంబంధాలు మొత్తం స్క్రీన్ టైమ్‌ను నియంత్రించిన తర్వాత కూడా ఉన్నాయని, అంటే టెక్నాలజీ వాడకం ఇక్కడ నాణ్యత, మోతాదుకంటే ముఖ్యమని అర్థం చేసుకోవచ్చు అంటున్నారు నిపుణులు.

టెక్నాలజీ వాడకంతో దృష్టి నియంత్రణ రెండు రకాలుగా ప్రభావితం అవుతుందని పరిశోధకులు కనుగొన్నారు. ఏంటంటే.. ఉద్దేశపూర్వక వాడకం దృష్టి నియంత్రణను మధ్యవర్తిగా ఉపయోగించి ఆఫ్‌లైన్ కార్యకలాపాలు, సామాజిక సంబంధాలు, సెల్ఫ్ కంట్రోలింగ్ వంటి అంశాలను పెంచి, మానసిక ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. ఇక అలవాటుగా వాడకం, అతిగా వాడకం, పర్పస్ లేకుండా వాడకం అనేది దీనికి విరుద్ధంగా ఏకాత్రతను చెదరగొడుతుంది. ‘ఆందోళన, ఒత్తిడి, నిరాశ’ వంటి సమస్యలను పెంచుతుంది. ఇది డిజిటల్ వెల్‌నెస్ ఇంటర్వెన్షన్లు రూపొందించేటప్పుడు సాంకేతికతను పూర్తిగా నివారించకుండా, ఉద్దేశ పూర్వకంగా వాడటంపై దృష్టి పెట్టాలని సూచిస్తుంది. మొత్తమ్మీద సాంకేతికతతో మన సంబంధం ఎలా ఉంటుందనేది మన ఏకాగ్రతను, నాణ్యతను నిర్ణయిస్తుందని అధ్యయనం పేర్కొన్నది. అలవాటు బటన్‌లు నొక్కడం కంటే.. ప్రతీ యాప్ లేదా ప్రతీ స్క్రోలింగ్ ఉద్దేశపూర్వకంగా వాడటం ద్వారా మెరుగైన దృష్టి, ఏకాగ్రత, మానసిక స్థితిని సాధించివచ్చునని, ఇలాంటి అవగాహనతో డిజిటల్ బ్యాలెన్స్ సాధిచడం ఆధునిక జీవితంలో అత్యంత ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు.

Next Story