హ్యాండ్ రైటింగ్.. ఆ విషయంలో టైపింగ్‌ కంటే మేలు చేస్తున్న అద్భుత సాధనం..!

by Javid Pasha |   (  Updated:2025-10-25 07:06:51  IST  )

టైపింగ్ కంటే కూడా చేతితో రాయడమనేది మెదడులో ఎక్కువ సంక్లిష్టమైన(more complex) నాడీ కనెక్షన్లను యాక్టివేట్ చేస్తుంది.

హ్యాండ్ రైటింగ్.. ఆ విషయంలో టైపింగ్‌ కంటే మేలు చేస్తున్న అద్భుత సాధనం..!
X

దిశ, ఫీచర్స్ : ఏదైనా సమాచారాన్ని ఇతరులతో పంచుకోవడానికి, స్టోరీలు రాయడానికి, సందేశాలు పంపడానికి ఒకప్పుడు కేవలం హ్యాండ్ రైటింగ్‌ను మాత్రమే ఉపయోగించుకునేవాళ్లు. కంప్యూటర్లు, ఫోన్లు అందుబాటులోకి వచ్చాక టైపింగ్ ద్వారా ఆ పనిచేస్తున్నారు. ఇప్పుడు ఈ రెండింటిని కూడా మనం అవసరాన్ని అనుసరిస్తున్నాం. అయితే టైపింగ్ చేయడం కంటే కూడా, చేతితో రాయడంవల్ల కొన్ని అదనపు ప్రయోజనాలు ఉన్నాయని నార్వేలోని నార్వేజియన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (NTNU)కి చెందిన నిపుణుల అధ్యయనంలో వెల్లడైంది. అవేమిటో చూద్దాం.

*టైపింగ్ కంటే కూడా చేతితో రాయడమనేది మెదడులో ఎక్కువ సంక్లిష్టమైన(more complex) నాడీ కనెక్షన్లను యాక్టివేట్ చేస్తుంది. పైగా హ్యాండ్ రైటింగ్ ప్రాసెస్‌లో అక్షరాలను రూపొందించడానికి వేలు కదలికలు, ఫోకస్, మోటార్ స్కిల్స్ అండ్ సెన్సరీ ప్రాసెసింగ్ (Sensory processing) ఒకేసారి పనిచేస్తాయి. ఈ సమన్వయం మెదడుకు సంబంధించిన వివిధ భాగాలను ఉత్తేజపరిచి, జ్ఞాపకశక్తిని, ఏకాగ్రతను మెరుగుపరుస్తుంది.

*కేవలం 15 నిమిషాల హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్, ల్యాప్‌టాప్‌లో టైప్ చేసిన అనేక పేజీల కంటే కూడా ఎక్కువగా జ్ఞాపకశక్తిని పెంచుతుందని అధ్యయనం వెల్లడించింది. పిల్లల విషయంలో చేతిరాత ‘b’ అండ్ ‘d’ వంటి మిర్రర్ లెటర్స్ కారణంగా తలెత్తే గందరగోళాన్ని తగ్గిస్తుంది. ఎందుకంటే అక్షరాల ఆకృతిని(Shape), దిశను( direction) మెదడు బాగా గుర్తుంచుకుంటుంది. ఈ అధ్యయనం డిజిటల్ యుగంలో హ్యాండ్ రైటింగ్ ప్రాముఖ్యతను గుర్తు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. విద్యార్థుల మేధో సామర్థ్యాన్ని, సృజనాత్మకతను మెరుగుపరచడానికి చేతిరాతను ప్రోత్సహించడం ముఖ్యమని చెబుతున్నారు. మొత్తానికి జ్ఞాపక శక్తిని పెంచడంలో, గందరగోళాన్ని నివారించడంలో పిల్లలు, పెద్దలు ఎవరికైనా టైపింగ్ కంటే హ్యాండ్ రైటింగ్ మరింత ఎఫెక్టివ్‌గా పనిచేస్తుందని అధ్యయనం పేర్కొన్నది.

Next Story