- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Health : తేనెటీగల విషం.. బ్రెస్ట్ క్యాన్సర్ నివారణలో సహాయపడుతుందా?
తేనెటీగ విషం, ముఖ్యంగా దాని ప్రధాన భాగమైన మెలిటిన్ బ్రెస్ట్ క్యాన్సర్ కణాలను దాదాపు పూర్తిగా నాశనం చేస్తుందని పరిశోధనలో తేలింది.

దిశ, ఫీచర్స్ : క్యాన్సర్.. అది ఏ రకమైనది అయినప్పటికీ ఇప్పటికీ ప్రాణాంతక సమస్యగానే ఉంటున్నది. త్వరగా గుర్తించకపోవడం, చికిత్స ఆలస్యం కావడం, ట్రీట్మెంట్‌లో వైఫల్యాలు వంటివి మరణాలకు దారితీస్తుంటాయి. ముఖ్యంగా మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ పెరుగుతోంది. అయితే ఈ మహమ్మారి నివారణ, నిర్మూలనపై చాలాకాలంగా పరిశోధనలు జరుగుతున్నాయి. కాగా ఆస్ట్రేలియాలోని హ్యారీ పెర్కిన్స్ ఇన్‌స్టిట్యూట్ పరిశోధకులు నిర్వహించిన అధ్యయనం ఒక ఆసక్తికరమైన అంశాన్ని మనముందుకు తెచ్చింది. ఏంటంటే.. తేనెటీగ విషం అండ్ మెలిటిన్ ట్రిపుల్ - నెగెటివ్ అండ్ HER2-ఎన్‌రిచ్డ్ బ్రెస్ట్ క్యాన్సర్ కణాలను వేగంగా నాశనం చేస్తాయని తేలింది.
మెలిటిన్ కీ రోల్
పరిశోధకుల స్టడీ వివరాల ప్రకారం.. తేనెటీగ విషం(Bee venom), ముఖ్యంగా దాని ప్రధాన భాగమైన మెలిటిన్, ల్యాబ్ ప్రయోగాల్లో కొన్ని రకాల బ్రెస్ట్ క్యాన్సర్ కణాలను దాదాపు పూర్తిగా నాశనం చేస్తుందని నిరూపితమైంది. కానీ ఇది కఠినంగా నియంత్రిత ఇన్-విట్రో (cells grown in petri dishes)సెట్టింగ్‌లలో మాత్రమే. నిజానికి మెలిటిన్ EGFR అండ్ HER2 రిసెప్టర్ల ఫాస్ఫారిలేషన్‌ను అడ్డుకుని క్యాన్సర్ కణాల మెంబ్రేన్‌ను దెబ్బతీస్తుంది. ఇది క్యాన్సర్ కణాల మరణానికి (Apoptosis) దారితీస్తుంది. అలాగే ఇన్-విట్రో (సెల్ కల్చర్) అధ్యయనాల్లో MDA-MB-231, MCF-7 వంటి కణాలపై మెలిటిన్ PI3K/Akt/mTOR, NF-κB మార్గాలను అణచివేసి, మైగ్రేషన్, అలాగే ఇన్వేషన్‌ను తగ్గిస్తుంది.
కణాలను నాశనం చేస్తాయి!
ఈ ప్రయోగాలు పెట్రీ డిష్‌లలో పెంచిన క్యాన్సర్ కణాలపై కచ్చితమైన డోసులు వర్తింపజేసి నిర్వహించబడతాయి. కాబట్టి అక్కడ సక్సెస్ అయ్యాయి. కానీ మానవ శరీరంలో ఈ ప్రభావాన్ని అంత సులభంగా సురక్షితంగా లేదా సమర్థవంతంగా పునరావృతం చేయలేమని కూడా పరిశోధకులు అంటున్నారు. ఎందుకంటే ఏమాత్రం తప్పిదం జరిగినా క్యాన్సర్ కణాలతోపాటు అవసరమైన, ఆరోగ్యవంతమైన కణాలను దెబ్బతినే చాన్స్ ఉంటుంది. తీవ్రమైన ఇమ్యూన్ రియాక్షన్‌లను దారితీస్తుంది. ప్రయోగాల సందర్భంగా, మౌస్ మోడల్స్‌లో మెలిటిన్ ట్యూమర్ గ్రోత్‌ను తగ్గించినప్పటికీ, మానవులలో కూడా అలాగే జరుగుతుందని చెప్పగలిగే క్లినికల్ ట్రయల్స్ ఏవీ లేవు. దీనిపై పరిశోధనలు ఇంకా కొనసాగుతున్నాయి. క్లినికల్ ట్రయల్స్‌లో సక్సెస్ అయితే గనుక మానవ జీవన ప్రమాణాలను పెంచడంలో, క్యాన్సర్ల నుంచి రక్షించడంలో తేనెటీగల విషం కీ రోల్ పోషిస్తుంది.






