- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Mother's influence : ఆ విషయాల్లో కూతుళ్లపై తల్లి ప్రభావం..! వారిని ఎలా మారుస్తుందంటే..
అంతేకాదు ఎంత ఒత్తిడిలో ఉన్నా అద్భుతమైన ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ (problem-solving skills) ప్రదర్శిస్తుంటారు అమ్మాయిలు. కారణం తల్లి ప్రభావం. ఎందుకంటే..

దిశ, ఫీచర్స్ : అమ్మ లాలనలో గారాబంగా పెరగడమే కాదు. అనేక విషయాల్లో అమ్మను అనుసరిస్తుంటారు కూతుళ్లు. అమ్మను చూస్తూ.. అమ్మను అనుసరిస్తూ.. అనుకరిస్తూ.. అబ్జర్వ్ చేస్తూ.. వీరు చాలా నేర్చుకుంటారని, అందుకే తల్లి ప్రభావం కూతుళ్ల వ్యక్తిత్వంపై, వారి భవిష్యత్ జీవన నైపుణ్యాలపై అధికంగా ఉంటుదని హార్వర్డ్ యూనివర్సిటీ నిర్వహించిన ఒక అధ్యయనంలో వెల్లడైంది. ముఖ్యంగా ఉద్యోగం చేసే తల్లుల ప్రభావం కూతుళ్లపై ఎలా ఉంటుందనే అంశంపై అధ్యయనం మరింత ఫోకస్ చేసింది.
ఒక మహిళ మొక్కవోని ధైర్యంతో ముందడుగు వేసిందా? ఎంతో కష్టమనుకున్న పనిలో సైతం సక్సెస్ సాధించిందా? ఎక్కువ జీతం గల ఉద్యోగాన్ని పొందిందా? నాయకత్వ పదవులను అలంకరించిందా? అయితే నో డౌట్.. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో, చిన్నప్పటి పెంపకం ద్వారానో ఆమెపై తల్లి ప్రభావం తప్పక ఉండే ఉంటుంది అంటున్నారు అధ్యయనాన్ని విశ్లేషించిన నిపుణులు. అంతేకాదు ఎంత ఒత్తిడిలో ఉన్నా అద్భుతమైన ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ (problem-solving skills) ప్రదర్శిస్తుంటారు అమ్మాయిలు. కారణం తల్లి ప్రభావం. అమ్మ గృహిణి కావచ్చు.. ఉద్యోగస్తురాలు కావచ్చు.. ఏదైతేనేం.. సమాజంలో, కుటుంబంలో ఆమె చేసే జీవన పోరాటాన్ని, ఎదుర్కొనే ఒత్తిడిని, సవాళ్లను చూస్తూ పెరిగిన కూతుళ్లు చిన్నప్పటి నుంచీ పరిశీలిస్తూ ఉండటం ద్వారా ఆటోమేటిగ్గా ఆ స్కిల్స్‌ను అలవర్చుకుంటారు. ఆ తర్వాత యుక్త వయసులో, పెళ్లి తర్వాత కూడా సందర్భాలను, పరిస్థితులను మేనేజ్ చేయడానికి అవి ఉపయోగించుకుంటారని నిపుణులు చెబుతున్నారు.
ముఖ్యంగా ఒక కుమార్తె తన తల్లి వర్క్ డెడ్‌లైన్స్, రాత్రి భోజనం, పాఠశాల డ్రాప్ - ఆఫ్‌లు, అనారోగ్యాలు, గాయపడిన మోకాళ్ల నొప్పిని మేనేజ్ చేయడం చూస్తూ పెరగడం ఆమెలో అవగాహనను కల్పిస్తాయి. తల్లిపడే రోజువారీ కష్టాలు, ఎదుర్కొనే సవాళ్లు, తల్లిలోని సమస్య పరిష్కార నైపుణ్యాలు చూడటం కూతుళ్లను మెంటల్లీ స్ట్రాంగ్‌గా మారుస్తాయి. ఇక ఉద్యోగం చేసే తల్లుల కుమార్తెల్లో అయితే ఈ ప్రాబ్లం సాల్వింగ్ స్కిల్స్ మరింత ఎఫెక్టివ్‌గా ఉంటాయని కూడా అధ్యయనం పేర్కొన్నది. దీంతో వీరు పెద్దయ్యాక స్వతంత్రంగా, మెంటల్లీ స్ట్రాంగ్‌గా ఉండే అవకాశం ఎక్కువ. అలాగే ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ లైఫ్‌లో మహిళలు సక్సెస్ సాధించడం వెనుక వారి తల్లి ప్రభావం ఉంటుందని అధ్యయనం తెలిపింది. ఎందుకంటే.. కష్టనష్టాలేమిటో వీరు తల్లిని చూసి అవగాహన చేసుకొని ఉంటారు. తల్లి వాటిని ఎలా ఎదుర్కొన్నది, ఎలా పరిష్కరించింది నేర్చుకుంటారు.
అలసటలోనూ బెస్ట్ పర్ఫామెన్స్ కనబర్చడం, మల్టీటాస్కింగ్ పనుల నిర్వహణ, మాతృత్వాన్ని స్వీకరించడం, కుటుంబం కోసం త్యాగం చేయడం, వైఫల్యం తర్వాత కూడా నిరాశ చెందకుండా మళ్లీ ప్రయత్నించడం వంటి లక్షణాలన్నీ మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఈ విధమైన వారి బాధ్యతలు, ఆలోచనలు, నైపుణ్యాల వెనుక తల్లి ప్రభావం చాలా ఉంటుందని అధ్యయనం తెలిపింది. యుక్త వయసు నుంచి వృద్ధాప్యం వరకు ఒక మహిళ జీవితంలో రాణించడం వెనుక అమ్మ పాత్ర కీలకంగా ఉంటుందని స్పష్టం చేసింది. Link






